Share News

Chennai: వివాహేతర సంబంధం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 27 , 2025 | 11:55 AM

ప్రియురాలిపై దాడి చేసి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. తమిళనాడు రాష్ట్రం వేలూర జిల్లాలో సురేష్‌ అనే వ్యక్తికి సబీనా బానుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. ఇద్దరి మధ్య ఏర్పడ్డ విభేదాలతో సురేష్ ఆమెను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

Chennai: వివాహేతర సంబంధం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

- ప్రియురాలిపై దాడి చేసి యువకుడి ఆత్మహత్య

చెన్నై: వేలూరు జిల్లా చిన్నఅల్లాపురానికి చెందిన సబీనా బాను (33)గత రెండేళ్ళుగా తన భర్త ఛాన్‌భాషాతో గొడవల కారణంగా తన పుట్టింట్లో ఉంటూ, ఓ దుకాణంలో పని చేస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా అదే షోరూంలో పనిచేస్తున్న సురేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, గత వారం సురేష్‏తో మాట్లాడుతున్న సమయంలో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


city6.2.jpg

దీంతో ఆదివారం రాత్రి 11.30 గంటలకు సబీనా ఇంటికి వచ్చిన సురేష్‌ పక్కనేవున్న ఇనుపరాడ్డుతో సబీనాను బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత తన ఇంటికి వెళ్ళిన సురేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, విచారణ చర్యలు చేపట్టారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest Telangana News and National News

Updated Date - May 27 , 2025 | 11:55 AM