Hyderabad: కర్ణాటక నుంచి నగరానికి గంజాయి..
ABN , Publish Date - May 18 , 2025 | 07:29 AM
కర్ణాటక నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి రవాణా చేస్తున్న విషయం బయటపడింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
- 10 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: కర్ణాటక(Karnataka) నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు ఎక్సైజ్ పోలీసులు. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్(Qutubullapur) ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ మాధవయ్య ఆదేశాలతో సీఐ నర్సిరెడ్డి, ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
విచారణలో వారిని అనంతపురం గుంతకల్ ప్రాంతానికి చెందిన చాకలి వంశీ, నేమకల్ వాల్మీకి వేణుగోపాల్‌గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రాము అనే వ్యక్తి వద్ద 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి బైక్‌పై నగరానికి తీసుకొచ్చి సుచిత్ర కొంపల్లి చౌరస్తాలో విక్రయించేందుకు వెళ్లారు. అక్కడ కస్టమర్ల కోసం వేసి ఉండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలో కొనుగోలు చేసిన గంజాయిని కారులో తరలిస్తే అనుమానం వస్తుందని బైక్‌పై గుంతకల్ నుంచి హైదరాబాద్‌కు తెచ్చినట్టు పోలీసులు తేల్చారు.

గంజాయితో పాటు, బైక్, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేశారు. వీటి మొత్తం విలువ రూ. 10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఠాను పట్టుకున్న టీమ్‌లో సత్తార్, సంజయ్, వెంకటేశ్వర్‌రావు, తేజ మునాప్‌లు ఉన్నారు. సిబ్బందిని మేడ్చల్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఫయాజుద్దీన్ అభినందించారు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం
MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
Read Latest Telangana News and National News