Share News

Chennai: ఏనుగు దాడిలో వృద్ధుడి మృతి

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:42 PM

కోవై జిల్లా తుడియలూరు సమీపం తటాకం వద్ద అడవి ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. ఈ సంఘటన నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానికులు ధర్నాకు దిగారు.

Chennai: ఏనుగు దాడిలో వృద్ధుడి మృతి

- తుడియలూరులో స్థానికుల ధర్నా

చెన్నై: కోవై జిల్లా తుడియలూరు సమీపం తటాకం వద్ద అడవి ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. ఈ సంఘటన నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానికులు ధర్నాకు దిగారు. తుడియలూరు(Tudiyalur) సమీపం పన్నిమడై తాలియూరకు చెందిన నటరాజ్‌ (69) కిరాణా దుకాణం నడుపుతున్నాడు, రోజూ వేకువజామున నటరాజ్‌(Nataraj) వాకింగ్‌ వెళ్తుంటారు. ఆ మేరకు గురువారం వేకువజాము తటాకం రోడ్డులో వాకింగ్‌కు చేస్తుండగా ఓ అడవి ఏనుగు అతడిని తరముకుంటూ వచ్చి తొండంతో విసిరికొట్టింది.

ఈ వార్తను కూడా చదవండి: విద్యార్థిని అత్యాచారం కేసు.. పక్షవాతం అంటూ నిందితుడి నాటకం


city7.jpg

నటరాజ్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నటరాజ్‌ కుటుంబీకులు, స్థానికులు ఆ ప్రాంతంలో ధర్నా, రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు(Forest officials) హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికులతో చర్చించి, వీలైనంత త్వరగా ఏనుగును బంధించి అడవిలోకి తరిమికొట్టేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించుకున్నారు. గౌండంపాళయం ఎమ్మెల్యే పీఆర్‌జీ అరుణకుమార్‌(MLA PRG Arunakumar) మృతుడి కుటుంబీకులను పరామర్శించారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 01:42 PM