Hyderabad: మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:18 AM
మద్యం మత్తులో యువకులు 102 అంబులెన్స్‌పై దాడి చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి ఇద్దరు బాలింతలను ఇబ్రహీంపట్నం సమీపంలోని నాగిళ్ల మడుగుకు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు.
- అడ్డుకోబోయిన మాంగళ్య షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డ్‌పై కూడా..
- డ్రైవర్‌తో కాళ్లు మొక్కించుకున్న యువకులు
హైదరాబాద్: మద్యం మత్తులో యువకులు 102 అంబులెన్స్‌పై దాడి చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్(Vanasthalipuram Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి ఇద్దరు బాలింతలను ఇబ్రహీంపట్నం సమీపంలోని నాగిళ్ల మడుగుకు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా సమీపంలో మాంగళ్య షాపింగ్‌మాల్ వద్ద వెనుక నుంచి ఇన్నోవాలో మద్యం మత్తులో వస్తున్న ఇంజాపూర్‌కు చెందిన ముడావత్ ప్రశాంత్(23), అఖిల్(24) హారన్‌కొట్టారు.
దారి ఇవ్వలేదని ఆగ్రహించిన వారు అంబులెన్స్‌ను అడ్డగించి డ్రైవర్ యాదయ్యను దుర్భాషలాడి దాడిచేశారు. అడ్డుకున్న మాంగళ్య షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డును కూడా చితకబాదారు. అంబులెన్స్‌లో ఇద్దరు బాలింతలు ఉన్నారనీ, తమను వదిలేయాలని డ్రైవర్ బతిమలాడినా యువకులు పట్టించుకోలేదు.
తమ కాళ్లు మొక్కితేనే వదిలేస్తామనడంతో డ్రైవర్ యాదగిరి వారి కాళ్లు మొక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు వాహనాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అంబులెన్స్ డ్రైవర్ యాదయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News