Share News

Chennai News: అయ్యోతల్లీ.. నీకు అప్పు డే నూరేళ్లు నిండినాయమ్మా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:22 PM

ప్రహరీ గోడ కూలి నర్సింగ్‌ విద్యార్థిని మృతిచెందిన ఘటన విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతోంది.

Chennai News: అయ్యోతల్లీ.. నీకు అప్పు డే నూరేళ్లు నిండినాయమ్మా.. ఏం జరిగిందంటే..

- ఇంటి ప్రహరీ కూలి విద్యార్థిని మృతి

చెన్నై: ప్రహరీ గోడ కూలి నర్సింగ్‌ విద్యార్థిని(Nursing student) మృతిచెందిన ఘటన విరుదునగర్‌(Virudhunagar) జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో, ఈ నెల 18న వీరమణి తన భార్య రాధతో కలసి తన మట్టిల్లు శుభ్రం చేస్తుండగా ఇంటి బయట భవాని కూర్చుంది.


nani2.jfif

ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటి గోడ నాని కిందపడగా, గోడ శిధిలాల కింద భవాని(Bhavani) చిక్కుకుంది. తల్లితండ్రులు, చుట్టుపక్కల వారు శిధిలాల నుంచి ఆమెను బయటకు తీసి మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక మంగళవారం భవాని మృతిచెందింది. ఈ ఘటనపై తిరుత్తంగల్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2025 | 12:22 PM