Chennai News: సినిమాకు తీసుకెళ్లలేదని ఆ మహిళ చేసిన పనేంటో తెలిస్తే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:45 AM
భర్త సినిమాకు తీసుకెళ్లలేదంటూ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగయం పడియాండిపాళయం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ జీవాకు సౌమ్య అనే యువతితో 7 నెలల క్రితం వివాహమైంది.
చెన్నై: భర్త సినిమాకు తీసుకెళ్లలేదంటూ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగయం పడియాండిపాళయం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ జీవా(Jeeva)కు సౌమ్య అనే యువతితో 7 నెలల క్రితం వివాహమైంది.. సౌమ్య కాంగయంలోని ఓ ఫుట్ వేర్ దుకాణంలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో, తనను సినిమాకు తీసుకెళ్లాంటూ భర్తను వారం రోజులుగా కోరుతున్నా, పనుల కారణంగా జీవా తీసుకెళ్లలేదు.

ఈ విషయాన్ని సౌమ్య తన తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. మంగళవారం భర్త ఆటోకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సౌమ్య, హఠాత్తుగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి అనంతరం ఇంటికి వచ్చిన జీవా, భార్య ఉరేసుకోవడం గమనించి దిగ్ర్భాంతి చెంది, ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కాంగయం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News