Share News

Chennai: చిన్నారిపై లైంగిక వేధింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌

ABN , Publish Date - Jan 14 , 2025 | 10:49 AM

మదురైలో 15 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ రాష్ట్ర నేత ఎంఎస్. షా(BJP state leader M.S. Shah)ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Chennai: చిన్నారిపై లైంగిక వేధింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌

చెన్నై: మదురైలో 15 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ రాష్ట్ర నేత ఎంఎస్. షా(BJP state leader M.S. Shah)ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి మదురై పోలీసు(Madurai Police)లకు ఇచ్చి ఫిర్యాదులో రాష్ట్ర బీజేపీ ఆర్థిక విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్. షా తమ కుమార్తె సెల్‌ఫోన్‌(Cellphone)కు అసభ్య చిత్రాలు పంపించి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chinese manja: చైనా మాంజాపై టాస్క్‌ఫోర్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌


తన భార్య కూడా షాకు సహకరించిందని ఫిర్యాదులో తెలిపారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎంఎం షా బాలిక తల్లిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో షాను సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి మెజిస్ర్టేట్‌ వద్ద హాజరుపరచి, రిమాండ్‌కు తరలించారు.

nani3.3.jpg


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 10:49 AM