Law Student: కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి...
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:39 AM
కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
- రవాణా కార్మికుల ధర్నా
చెన్నై: స్థానిక కిలాంబా క్కం సమీపంలో ఎంటీసీ బస్సు కండక్టర్‌పై చెప్పుతో దాడికి పాల్పడిన లా కాలేజీ విద్యార్థినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ బస్‌స్టేషన్‌లో డ్రైవర్లు, కండక్టర్లు ధర్నాకు దిగారు. మద్రాస్ హైకోర్టు(Madras High Court) సమీపంలోని బ్రాడ్‌వే బస్‌స్టేషన్ నుండి కీలాంబాక్కంకు గురువారం రాత్రి బయలుదేరిన సిటీబస్సులో లా విద్యార్థిని తాంబరం వరకు టికెట్టు తీసుకుని ఆ స్టాప్‌లో దిగలేదు. గమనించిన కండక్టర్ బస్సు తాంబరం దాటినందు వల్ల అదనంగా రూ.15 టికెట్టు తీసుకోవాలని కోరడంతో అందుకు ఆమె నిరాకరించి కండక్టర్‌తో వాగ్వివాదానికి దిగింది.

వారి మధ్య మాటామాటా పెరిగి అసభ్యపదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో, కోపంతో ఆ విద్యార్థిని చెప్పుతో కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇదిలా వుండగా, ఆ బస్సు కీలాంబాక్కం బస్‌స్టేషన్‌కు చేరుకోగా, కండక్టర్ తనకు జరిగిన అవమానం గురించి అక్కడున్న డ్రైవర్లు, కండక్టర్లకు తెలియజేశారు. దీంతో కండక్టర్‌పై దాడి చేసిన విద్యార్థినిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు, కండక్టర్లు ధర్నాలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా, విద్యార్థిని, కండక్టర్ వేర్వేరుగా కీలాంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News