Chennai: మృత్యువులోనూ వీడని బంధం..
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:21 AM
ఐదు దశాబ్దాల పాటు అన్యోన్యంగా కాపురం చేసిన వృద్ద దంపతులు ఒకే రోజు మృతిచెందడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈరోడ్ వలయక్కార వీధిలో అన్నియప్పన్ (84), పాపమ్మాళ్ (79) అనే దంపతులు నివసిస్తున్నారు.
- ఒకే రోజు దంపతుల మృతి
చెన్నై: ఐదు దశాబ్దాల పాటు అన్యోన్యంగా కాపురం చేసిన వృద్ద దంపతులు ఒకే రోజు మృతిచెందడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈరోడ్ వలయక్కార వీధిలో అన్నియప్పన్ (84), పాపమ్మాళ్ (79) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. వీరందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా వుంటున్నారు. 50 యేళ్ళకు పైగా కాపురం చేస్తున్న ఈ జంట ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరిని విడిచి ఒకరు వెళ్లేవారు కాదు.

ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం అన్నియప్పన్ ఇంటిలో జారిపడి గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటూ గురువారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులతో కలిసి ఆయనకు అంత్యక్రియలను నిర్వహించి అందరూ ఇంటికి తిరిగొచ్చారు. ఆ సమయంలో పాపమ్మాళ్ తన గదిలో మృతి చెంది ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. ఐదు దశాబ్దాలకు పైగా కలిసి కాపురం చేసిన ఆ దంపతులు మృత్యువులో వీడలేదంటూ కుటుంబీకులు, బంధువులు విలపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News