Bengaluru: నా ప్రేయసికి నేనంటే ప్రాణం..
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:23 AM
ప్లీజ్.. ఈ కేసులో నా ప్రియురాలిని తీసుకురాకండి అంటూ డెత్‌నోట్ రాసిపెట్టి దావణగెరె జిల్లా న్యామతి తాలూకా మాచిగొండనహళ్ళికు చెందిన యశ్వంత నాయక్ (24) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యశవంత నాయక్ తల్లి చేసిన ఫిర్యాదుతో పాటు డెత్‌నోట్‌లోని అంశాలను పోలీసులు మీడియాకు తెలిపారు.
- ఈ కేసులో ఆమెను చేర్చకండి ప్లీజ్
- డెత్‌నోట్ రాసి.. యువకుడి ఆత్మహత్య
బెంగళూరు: ప్లీజ్.. ఈ కేసులో నా ప్రియురాలిని తీసుకురాకండి అంటూ డెత్‌నోట్ రాసిపెట్టి దావణగెరె(Davanagere) జిల్లా న్యామతి తాలూకా మాచిగొండనహళ్ళికు చెందిన యశ్వంత నాయక్ (24) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యశవంత నాయక్ తల్లి చేసిన ఫిర్యాదుతో పాటు డెత్‌నోట్‌లోని అంశాలను పోలీసులు మీడియాకు తెలిపారు. అప్పుల బాధను భరించలేక పోతున్నానని అందరూ అనుకున్నట్లుగా డబ్బులు పాడు చేయలేదని అందులో రాశాడు. ప్రియురాలిని వివాదంలోకి తీసుకురాకూడదని తనపైనే ఆమె ప్రాణం పెట్టుకున్నట్లు రాసినట్లు తెలిపారు.

శివమొగ్గ(Shivamogga)లోని ఓ ఫైనాన్స్‌లో 5 లక్షలు అప్పు తీసుకోగా వారు ఇల్లు జప్తు చేస్తామని బెదరించారన్నారు. శివమొగ్గకు చెందిన ఓ వ్యక్తికి బైక్ తాకట్టు పెట్టి రూ.40వేలు తీసుకున్నట్లు రాశారన్నారు. ఇలా అప్పుల వారు ఇంటి వద్ద గొడవకు వస్తే అవమానం జరుగుతుందనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశారన్నారు. ఉరివేసుకుని యశవంతనాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. న్యామతి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News