Share News

Bengaluru News: డ్రాప్‌ చేస్తామని చెప్పి... రేప్‌ చేశారు..

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:55 PM

ఓ యువతి బస్టాండ్‌లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్‌ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్‌ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు.

Bengaluru News: డ్రాప్‌ చేస్తామని చెప్పి... రేప్‌ చేశారు..

- యువతి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్‌

బెంగళూరు: ఓ యువతి బస్టాండ్‌లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్‌ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర(Chikkaballapura) జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్‌ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు. తాను మంచేనహళ్ళికి వెళ్తున్నానన్నారు. ప్రస్తుతం బస్సులు లేవని ఎక్కడికెళ్లాలో చెప్తే దిగబెడతానంటూ నమ్మబలికారు.


దీంతో యువతి సికిందర్‌బాబా(Sikindhar Baba) ద్విచక్రవాహనంపై వెళ్లారు. మంచేనహళ్ళికి వెళ్లే మార్గంలో ఒక కొండగుట్టల తరహాలో ఉండే నిర్జన ప్రదేశానికి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడు. మంచేనహళ్ళి నుంచి చిక్కబళ్ళాపుర వైపు వెళ్తున్న మిత్రుడు జనార్ధన్‌ ఇదే సమయంలోనే ఫోన్‌ చేశాడు. అతడిని రమ్మన్నాడు. జనార్ధన్‌ కూడా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి పాడుచేశాడు.


pandu2.2.jpg

ఆ తర్వాత ఆమె ధరించిన కమ్మలను లాగేసుకున్నారు. ఊరికి సమీపంలో ఉండే ఓ పెట్రోల్‌బంకు వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆమె ఏదో కష్టంలో ఉందని తెలుసుకున్న పెట్రోల్‌బంకు సిబ్బంది ధైర్యం చెప్పారు. స్థానికులు అక్కడికి చేరుకోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిక్కబళ్ళాపుర మహిళా పోలీస్‌స్టేషన్‌కు బాధితురాలిని తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 12:58 PM