Hyderabad: ఐదో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:54 AM
కిస్మత్‌పూర్-బండ్లగూడ మార్గంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమావతిపేట్‌కు చెందిన కోరని మల్లేశ్ (27) బండ్లగూడ రహదారిలో ఉన్నఓ అపార్ట్‌మెంట్‌లో 27 రోజులుగా హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు.
హైదరాబాద్: కిస్మత్‌పూర్-బండ్లగూడ(Kismatpur-Bandlaguda) మార్గంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమావతిపేట్(Premavathipete)కు చెందిన కోరని మల్లేశ్ (27) బండ్లగూడ రహదారిలో ఉన్నఓ అపార్ట్‌మెంట్‌లో 27 రోజులుగా హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. మల్లేశ్‌కు మూడు సంవత్సరాల క్రితం మీనా అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. మల్లేశ్ సోమవారం అపార్ట్‌మెంట్(Apartment)లోని ఐదో అంతస్తులో ఉన్న నీటి సంపును శుభ్రం చేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: బడులు, గుడుల జోలికి వస్తే ఊరుకోం..

ఈ క్రమంలో ప్కనే పిట్టగోడకు ఎండ తగులకుండా ఏర్పాటుచేసిన రేకులపై కాలు పెట్టడంతో జారీ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లేశ్(Mallesh) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సదరు అపార్ట్‌మెంట్‌కు వెళ్లేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించారు. మల్లేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ ఎస్‌ఐ కిషోర్ దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News