Chennai: భార్య శీలాన్ని శంకించిన ప్రబుద్ధుడు.. ఇద్దరు పిల్లల్ని హతమార్చిన కసాయి తండ్రి
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:48 PM
భార్యశీలాన్ని శంకించిన భర్త తన ఇద్దరు పిల్లలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పక్కింటిలో దాగిన ఆ కసాయిని అరెస్టు చేశారు.
చెన్నై: సేలం(Selam) జిల్లా ఆత్తూరు సమీపం కృష్ణాపురం గ్రామంలో భార్యశీలాన్ని శంకించిన భర్త తన ఇద్దరు పిల్లలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పక్కింటిలో దాగిన ఆ కసాయిని అరెస్టు చేశారు. కృష్ణాపురంలో అశోక్‌కుమార్ (42), తవమణి (38) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి విద్యారాణి (13), అరుళ్‌కుమారి (13) అనే ఇద్దరు కుమార్తెలు, అరుళ్ ప్రకాష్ (5) అనే కుమారుడున్నాడు. అశోక్‌కుమార్ నైవేలిలో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Former CM: అబ్బో.. మాజీ సీఎం భలేమాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
అతడికి తాగుడు అలవాటు ఉంది. వారానికొకసారి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఆ మేరకు మంగళవారం రాత్రి పీకలదాకా తాగి అశోక్‌కుమార్(Ashok Kumar) ఇంటికి రాగా తవమణి అతడితో గొడవపడింది. అదే సమయంలో అశోక్‌కుమార్ తాగిన మైకంలో తవమణి శీలాన్ని శంకిస్తూ కొడుకు తనకు పుట్టలేదంటూ తవమణితో గొడవపెట్టుకున్నాడు. బుధవారం వేకువజాము వరకూ భర్తతొ గొడవపడి అలసిపోయిన తవమణి, ఆమె పిల్లలు ఓ గదిలో పడుకున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మరింత తాగి ఇంటికి చేరుకున్న అశోక్‌కుమార్ వేటకొడవలితో నిదురపోతున్న భార్యా, ముగ్గురు పిల్లలపై దాడి జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యారాణి, అరుళ్ ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. తవమణి, అరుళ్‌కుమారి తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు మృతి చెందారని అనుకున్న అశోక్‌కుమార్ వేటకొడవలితోనే పక్కింటో దూరాడు. అతడిని చూసిన ఆ ఇంటిలోనివారు కేకలు వేశారు.
చుట్టుపక్కలివారంతా లేచి అశోక్‌కుమార్ ఇంటిలోకి వెళ్లగా విద్యారాణి, అరుళ్ ప్రకాష్ విగత జీవులై పడి ఉండటాన్ని పక్కనే కొన ఊపిరితో ఉన్న తవమణి, అరుళ్‌కుమారిని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పక్కింటిలో దాగిన అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News