ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచాలని డిమాండ్..మరో ఛాన్స్ ఇస్తారా..
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:43 PM
సెప్టెంబర్ మాసం రాగానే ఐటీఆర్ ఫైలింగ్ గడువుకు సంబంధించి మళ్లీ పొడిగింపు డిమాండ్ ఊపందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ (CAAS) వంటి ప్రముఖ సంస్థలు ఐటీఆర్ గడువును మరింత పెంచాలని కోరుతున్నాయి.
సాధారణంగా ప్రతి ఏడాది జూలై 31తో ఐటీఆర్ ఫైలింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు, లేట్‌గా యుటిలిటీలు రిలీజ్ కావడం, డేటా మిస్ మ్యాచ్ వంటి కారణాలతో గడువు పెంచారు. దీంతో ఇప్పటికే ఐటీ డిపార్ట్‌మెంట్ ఒకసారి గడువును జూలై 30 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది (ITR Filing Deadline 2025). ఇది ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, HUFs, ఇతర సాధారణ ట్యాక్స్‌పేయర్లకు వర్తిస్తుంది.
గడువు పెంచాలి..
కానీ, ఇంకొంచెం టైం కావాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ (CAAS) లాంటి బాడీలు CBDTకి లేఖలు రాసి మరోసారి గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ ఏడాది ITR ఫారమ్‌లలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా సిస్టమ్‌లో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో టెక్నికల్ గ్లిచ్‌లు, పోర్టల్ స్లో ఉండడం, యుటిలిటీలు ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
ఈ కారణాలు కూడా..
చాలా మంది ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ITR-5 యుటిలిటీ ఆగస్ట్ 8న వచ్చిందని అంటున్నారు. దీంతోపాటు ITR-6 ఆగస్ట్ 14న, ITR-7 ఆగస్ట్ 21న రావడం.. ట్యాక్స్ ఆడిట్ యుటిలిటీలు (Form 3CA/3CB-3CD) కూడా ఆగస్ట్ 14న మాత్రమే విడుదలయ్యాయన్నారు. ఈ క్రమంలో ఆడిట్ అవసరమున్న అసెస్సీలకు సెప్టెంబర్ 30 గడువు ఉన్నా, అసలు వాళ్ల దగ్గర కంప్లీట్ చేయడానికి గడువు కేవలం 40 రోజులు కూడా లేవని అంటున్నారు.
డేటా మిస్‌మ్యాచ్
ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే Annual Information Statement (AIS)లో చూపించిన డేటా, Form 26ASలో ఉన్న సమాచారం మధ్య తేడాలు వస్తున్నాయట. దాంతో ఫైలింగ్ టైంలో అసెస్సీలు, CAలకు చాలా ఇబ్బంది ఏర్పడుతోందని చెబుతున్నారు.
ఇప్పుడు CBDT ఏమంటుంది?
ఇప్పటివరకు CBDT నుంచి మరోసారి గడువు పెంచే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ట్యాక్స్ కమ్యూనిటీ నుంచి వస్తున్న డిమాండ్, టెక్నికల్ సమస్యల నేపథ్యంలో మరోసారి డెడ్లైన్ పొడిగించే అవకాశం ఉందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ గడువు పొడిగించకపోతే మాత్రం రిటర్న్ ఫైల్ చేయని వారికి లేట్ ఫైన్ పడుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి