Share News

VinFast Cars India: భారత రోడ్లపైకి విన్‌ఫా్‌స్ట కార్లు

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:27 AM

వియత్నాం కంపెనీ విన్‌ఫా్‌స్ట ఎలక్ట్రిక్‌ కార్లు కూడా మన రోడ్లపైకి ప్రవేశించబోతున్నాయి. కంపెనీ తొలుత రెండు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడళ్లు వీఎఫ్‌6, వీఎ్‌ఫ7ను భారత మార్కెట్లోకి...

VinFast Cars India: భారత రోడ్లపైకి విన్‌ఫా్‌స్ట కార్లు

న్యూఢిల్లీ: వియత్నాం కంపెనీ విన్‌ఫా్‌స్ట ఎలక్ట్రిక్‌ కార్లు కూడా మన రోడ్లపైకి ప్రవేశించబోతున్నాయి. కంపెనీ తొలుత రెండు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడళ్లు వీఎఫ్‌6, వీఎ్‌ఫ7ను భారత మార్కెట్లోకి శనివారం విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించనున్న వీఎఫ్‌6 ప్రారంభ ధర రూ.16.49 లక్షలు కాగా.. గరిష్ఠ రేటు రూ.18.29 లక్షలుగా ఉంది. ఐదు వేరియంట్లలో లభించే వీఎఫ్‌7 ప్రారంభ రేటు రూ.28.89 లక్షలుగా ఉండగా గరిష్ఠ ధర రూ.25.49 లక్షలుగా ఉంది. ఈ కార్లు ఆరు రంగుల్లో లభించనున్నాయి. ఈ రెండు కార్లకు జూలైలోనే బుకింగ్‌ను ప్రారంభించింది. కాగా విన్‌ఫాస్ట్‌.. హైదరాబాద్‌ సహా దేశంలోని 27 నగరాల్లో మొత్తం 32 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 03:27 AM