Share News

US Giant Truist: హైదరాబాద్‌లో ట్రూయిస్ట్‌ జీసీసీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:57 AM

మరో అమెరికా దిగ్గజ కంపెనీ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. నార్త్‌ కరోలినా కేంద్రంగా పనిచేసే ట్రూయిస్ట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ‘టెక్‌ సెంటర్‌’ పేరుతో...

US Giant Truist: హైదరాబాద్‌లో ట్రూయిస్ట్‌ జీసీసీ

ముంబై: మరో అమెరికా దిగ్గజ కంపెనీ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. నార్త్‌ కరోలినా కేంద్రంగా పనిచేసే ట్రూయిస్ట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ‘టెక్‌ సెంటర్‌’ పేరుతో ఈ జీసీసీని ఏర్పాటు చేయనుంది. దాదాపు 25 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,200 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు కోసం భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ పోటీపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం ట్రూయిస్ట్‌ ఫైనాన్షియల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తోంది. ముందు దేశంలో ఎక్కడో ఒక చోట తాత్కాలికంగా ఈ జీసీసీని ఏర్పాటు చేసి రెండు లేదా మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో శాశ్వత కేంద్రాన్ని ఏర్పా,టు చేయాలనేది అమెరికా బ్యాంక్‌ లక్ష్యంగా తెలుస్తోంది. తొలి ఏడాది 1,000 మందితో ప్రారంభమయ్యే ఈ జీసీసీలో ఐదేళ్లు తిరిగే సరికి 3,000 వరకు ఉద్యోగాలు ఏర్పడతాయని సమాచారం.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 04:57 AM