India exports fall: అమెరికాకు తగ్గిన భారత్ ఎగుమతులు.. అక్టోబర్‌లో 28.5 శాతం క్షీణత..
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:05 PM
అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5 శాతం మేరకు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5 శాతం మేరకు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు 8.83 బిలియన్ డాలర్లు (రూ.78, 500 కోట్లు) నుంచి 6.31 బిలియన్ డాలర్లు (రూ.56, 000 కోట్లు)కు తగ్గిపోయాయి (US export decline).
భారత దేశ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత సుంకాలు పెంచుకుంటూ పోయి ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి పెంచారు. దీంతో అమెరికాకు భారత్ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే పలు ఇతర దేశాలపై కూడా అమెరికా భారీగా సుంకాలు విధించింది. చైనాపై 30 శాతం, జపాన్ 15 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కాగా, రొయ్యలు, రత్నాలు, ఆభరణాలు, ఆటో భాగాలు, విద్యుత్ యంత్రాలు వంటి అనేక ఉత్పత్తి వర్గాలు తమ ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని ఇతర ఆసియా, యూరోపియన్ మార్కెట్లకు మళ్లించాయి (jewellery export markets).
గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్‌లో అమెరికాకు రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 76 శాతం క్షీణించాయి (Indian trade news). అయితే వేరే మార్కెట్లను ఎంచుకోవడంతో మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులు స్వల్పంగా 1.5 శాతం మాత్రమే తగ్గాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతులు 79 శాతం, హాంకాంగ్‌కు 11 శాతం, బెల్జియంకు 8 శాతం పెరిగాయి. అయితే ఇతర ఆసియా దేశాలు గట్టి పోటీ ఇస్తున్న రంగాలైన కాటన్ దుస్తులు, క్రీడా వస్తువులు, కార్పెట్‌లు, తోలు పాదరక్షలు వంటి విభాగాలు ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి