Trump Tariffs Slam Indian Stock Market: సుంకాల సంకటం
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:53 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. భారత ఎగుమతులపై ట్రంప్ అదనంగా 25 శాతం జోడించి 50 శాతానికి పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో...
2 రోజుల్లో సెన్సెక్స్ 1,555 పాయింట్లు పతనం
రూ..69 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరి
టెక్స్‌టైల్స్, రొయ్యలు, తోలు, జెమ్స్ అండ్ జువెలరీ షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడిన మదుపరులు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. భారత ఎగుమతులపై ట్రంప్ అదనంగా 25 శాతం జోడించి 50 శాతానికి పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు ఎగుమతి ప్రభావిత కంపెనీల షేర్లలో పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. దాంతో బీఎ్‌సఈ సెన్సెక్స్ గురువారం మరో 705.97 పాయింట్లు పతనమై 80,080.57 వద్దకు జారుకుంది. నిఫ్టీ 211.15 పాయిం ట్లు కోల్పోయి 24,500.90 స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోయాయి..
వినాయక చవితి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు బుధవారం సెలవు పాటించాయి. సుంకాల పోటుతో గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో (మంగళవారం, గురువారం) సెన్సెక్స్ 1,555.34 పాయింట్లు, నిఫ్టీ 466.85 పాయింట్లు క్షీణించాయి. రెండు రోజుల్లో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.69 లక్షల కోట్లు తగ్గి రూ.445.17 లక్షల కోట్లకు (5.08 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
ఈ రంగాలపై అధిక ప్రభావం
ట్రంప్ సుంకాల పోటుతో టెక్స్‌టైల్స్, రొయ్యలు, తోలు, జెమ్స్ అండ్ జువెలరీ రంగ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా కంపెనీల షేర్ల నష్ట వివరాలు..
కంపెనీ షేరు నష్టం%)
టెక్స్‌టైల్స్
కిటెక్స్ గార్మెంట్స్ 5.0
పర్ల్ గ్లోబల్ 2.94
సియారామ్ సిల్క్ మిల్స్ 2.56
రేమండ్ లైఫ్‌స్టైల్ 2.37
అలోక్ ఇండస్ట్రీస్ 1.59
రూప అండ్ కంపెనీ 1.43
వెల్‌స్పన్ లివింగ్ 1.09
ట్రైడెంట్ లిమిటెడ్ 1.01
రొయ్యలు
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 5.36
వాటర్‌బేస్ లిమిటెడ్ 3.38
అవంతి ఫీడ్స్ 0.82
తోలు, పాదరక్షలు
ఖదీమ్ ఇండియా 1.95
రిలాక్సో ఫుట్‌వేర్ 1.84
మయూర్ యూనికోటర్స్ 0.83
సూపర్‌హౌస్ లిమిటెడ్ 0.56
మీర్జా ఇంటర్నేషనల్ 0.50
జెమ్స్ అండ్ జువెలరీ
బ్లూస్టోన్ జువెలరీ 3.51
స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ 3.23
శాంతి గోల్డ్ 3.05
త్రిభువన్‌దా్‌స భీమ్‌జీ జవేరీ 0.84
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 0.37
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి