Share News

Trump Tariffs: ఫర్నీచర్‌పైనా ట్రంప్‌ సుంకాలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:48 AM

అమెరికాలోకి దిగుమతయ్యే ఫర్నీచర్‌పైనా సుంకాలు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత వారాంతంలో సంకేతాలిచ్చారు. ప్రస్తుతం తమ దేశంలోకి ఫర్నీచర్‌ దిగుమతులపై దర్యాప్తును ప్రారంభించడం...

Trump Tariffs: ఫర్నీచర్‌పైనా ట్రంప్‌ సుంకాలు

అక్టోబరులో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: అమెరికాలోకి దిగుమతయ్యే ఫర్నీచర్‌పైనా సుంకాలు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత వారాంతంలో సంకేతాలిచ్చారు. ప్రస్తుతం తమ దేశంలోకి ఫర్నీచర్‌ దిగుమతులపై దర్యాప్తును ప్రారంభించడం జరిగిందని, 50 రోజుల్లో పూర్తవనున్న దర్యాప్తు అనంతరం ఎంత మేర సుంకాలు విధించాలనేది నిర్ణయిస్తామన్నారు. ఇది భారత ఫర్నీచర్‌ ఎగుమతులపైనా గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద ఫర్నీచర్‌ దిగుమతిదారు. ప్రపంచ దిగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. గత ఏడాది యూఎస్‌ 2,896 కోట్ల డాలర్ల విలువైన ఫర్నీచర్‌ను దిగుమతి చేసుకుంది. అందులో 60 శాతం చైనా, వియత్నాం నుంచే తరలిపోయింది. కాగా, అమెరికాకు భారత్‌ ఎనిమిదో అతిపెద్ద ఫర్నీచర్‌ ఎగుమతిదారు. జీటీఆర్‌ఐ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో మన దేశం నుంచి 110 కోట్ల డాలర్ల విలువైన ఫర్నీచర్‌, బెడ్లు, పరుపులు అమెరికాకు ఎగుమతయ్యాయి. మన ఫర్నీచర్‌ సంబంధిత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 45 శాతం వాటా.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 01:48 AM