Business Idea : ఈ బిజినెస్ స్టార్ట్ చేసినవారికి తిరుగుండదు.. రోజుకు రూ.15వేల ఆదాయం..
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:37 PM
Business Idea : ప్రస్తుతం ఈ కొత్త బిజినెస్ ఐడియా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వ్యాపారం మొదలుపెట్టిన వారికి ఇక తిరుగుండదు. చాలా తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండానే రోజుకు రూ.15 వేలు సంపాదించవచ్చంట. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి.. ఎలా చేయాలని తెలుసుకోవాలనుందా.. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

Business Idea : ఇప్పుడంతా తీరిక లేని ఉద్యోగాలతో బిజీగా గడపుతున్నారు. ఊపిరిసలపనంత పనులతో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపించలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా సిటీల్లో ఉద్యోగాలు చేసేవారే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంట్లో వండుకునేంత సమయం లేక, మంచి పోషకాహారం సమయానికి అందక నానా అగచాట్లు పడుతుంటారు. ఇక చాలామందికి ఛాయ్ లేదా కాఫీ తాగే అలవాటు ఉండటం సహజం. అయినా, ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడంతా హెల్తీ ఫుడ్ తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే, ప్రస్తుతం ఈ బిజినెస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వ్యాపారం మొదలుపెట్టిన ఓ యువకుడు రోజుకు రూ.15వేలు ఈజీగా సంపాదిస్తున్నాడంటే నమ్మగలరా? నమ్మలేకపోయినా ఇదే నిజం. పెద్దగా పెట్టుబడి లేకుండానే టీ అమ్మేస్తూ ప్రతి నెలా లక్షలు రాబడి పొందుతున్నాడు.. అదెలాగో చూద్దాం..
టీ అమ్ముతూ రోజుకు రూ.15వేలు..
పొద్దున లేవగానే గొంతులో వేడి వేడిగా ఛాయ్ లేదా కాఫీ తాగటం చాలా ఇళ్లల్లో కనిపించేదే. రోజులో పని మధ్యలో రిలాక్సేషన్ కోసం తాగేవారు ఎక్కువే. కానీ షుగర్ ఉన్నవారైనా లేనివారైనా ఈ అలవాటును కొనసాగిస్తే ఆరోగ్యానికి మరింత ప్రమాదం. అందుకే చక్కెరతో చేసిన టీ లేదా కాఫీలకు బదులుగా బెల్లం టీని తాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రజల ఆలోచనను గమనించిన కెవిన్ జోర్డాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ చౌరస్తాలో తొలిసారి బెల్లం టీ వ్యాపారం మొదలుపెట్టి దూసుకుపోతున్నాడు. యాలకుల చాయ్, బ్లాక్ చాయ్, అల్లం చాయ్, చాక్లెట్ చాయ్ ఇలా రకరకాల ఫ్లేవర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఒక కప్పు టీని రూ.10లకు విక్రయిస్తూనే కెవిన్ రోజుకు రూ.15వేలు సంపాదిస్తున్నాడు. దీన్ని బట్టే ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఛత్రపతి శివాజీని స్మరిస్తున్న సినీఫ్యాన్స్
బెల్లం టీ వ్యాపారం ప్రారంభించేందుకు ఇలా చేయండి..
నిజానికి బెల్లం టీ తయారు చేయడం చాలా సులభం. మరుగుతున్న పాలల్లో బెల్లం ఛాయ్ పొడిని వేస్తే చాలు. క్షణాల్లోనే ఘుమఘమలాడే బెల్లం టీ తయారైపోతుంది. ఇక ఈ వ్యాపారం ఏ స్థాయిలో ప్రారంభించాలి అనే దాన్ని బట్టి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్టాల్ ఏర్పాటు చేస్తే మంచి ఆదాయం లభిస్తుంది. ఎలా తయారుచేయాలి అనే విషయంలో సందేహం ఉన్నవారు కెవిన్ జోర్డాన్‌లాగా ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. పుణెకు చెందిన జాగరీ టేల్స్ అనే కంపెనీ రూ.2లక్షల నుంచి మొదలుకుని ఫ్రాంచైజీ ఇస్తోంది. షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన ఎక్విప్‍మెంట్, రెసిపీ తయారీ విధానం ఇలా అన్నీ వాళ్లే నేర్పిస్తారు. ఆదాయంలో 90% పైగా ఫ్రాంచైజీ తీసుకున్నవారికే దక్కుతుంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులతోనే ఈ వ్యాపారం నడిపించవచ్చు. తక్కువ ఖర్చుతో సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు కాస్త సమయం పట్టినా మంచి లాభాలు అందుకుంటారు.
Read Also : TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
THKTS: హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు అత్తమామల
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..