Share News

Tax Saving Funds: రాబడి, పన్ను ఆదా చేసే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్

ABN , Publish Date - Jul 02 , 2025 | 08:40 PM

మీరు పన్ను ఆదా చేయడంతోపాటు మంచి రాబడి పొందాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే అలాంటి టాప్ 3 ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) గురించి ఇక్కడ తెలుపడం (Tax Saving Funds) జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tax Saving Funds: రాబడి, పన్ను ఆదా చేసే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్
Tax Saving Funds

మీరు పన్ను ఆదా చేస్తూనే మంచి రాబడిని పొందాలనుకుంటున్నారా. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) ఎంపిక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ఫండ్స్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలిక రాబడిని పొందుతారు. దీంతోపాటు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో మూడు ప్రముఖ ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ (Tax Saving Funds) గురించి తెలుసుకుందాం.


మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్‌ఎస్‌ఎస్ టాక్స్ సేవర్ ఫండ్

మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్ గత 5 సంవత్సరాలలో సంవత్సరానికి 29.31% రాబడిని అందించింది. ఇది మంచి పనితీరును కలిగి ఉంది. ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) రూ.61.13 కాగా, ఇది రూ.4,360 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. 2014 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ఫండ్, నిఫ్టీ 500 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే సంవత్సరానికి 18.81% రాబడిని సాధించింది. ఈ ఫండ్ ఖర్చు నిష్పత్తి కేవలం 0.64%. ఇది ఈ విభాగంలో అత్యంత తక్కువ కావడం విశేషం. దీనిలో కనీస సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కనీస పెట్టుబడి రూ.500గా ఉంది. కనీస లంప్‌సమ్ రూ.1,000. గత 5 సంవత్సరాలలో రూ.3.5 లక్షల ఒకేసారి పెట్టుబడి ఈ ఫండ్‌లో రూ.12,66,000 కార్పస్‌గా మారింది.


ఎస్‌బీఐ టాక్స్ సేవర్ ఫండ్

ఎస్‌బీఐ ఈఎల్‌ఎస్‌ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ గత 5 సంవత్సరాలలో సంవత్సరానికి 28.71% రాబడిని అందించింది. ఈ ఫండ్ NAV రూ.479.24 కాగా, ఇది రూ.29,667 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. 2013 జనవరిలో ప్రారంభమైన ఈ ఫండ్, బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే సంవత్సరానికి 16.92% రాబడిని సాధించింది. ఈ ఫండ్ ఖర్చు నిష్పత్తి 0.93%, ఇది సగటు స్థాయిలో ఉంది. కనీస SIP రూ.500, కనీస లంప్‌సమ్ రూ.1,000. గత 5 సంవత్సరాలలో రూ.3.5 లక్షల ఒకేసారి పెట్టుబడి రూ.12,36,000 కార్పస్‌గా మారింది. ఈ ఫండ్ స్థిరమైన రాబడి, మంచి ఆస్తి కారణంగా నమ్మకమైన ఎంపికగా ఉంది.


హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్ సేవర్ ఫండ్

హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ గత 5 సంవత్సరాలలో సంవత్సరానికి 27.74% రాబడిని అందించింది. ఈ ఫండ్ NAV రూ.1539.094, ఇది రూ.16,454 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. 2013 జనవరిలో ప్రారంభమైన ఈ ఫండ్, నిఫ్టీ 500 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే సంవత్సరానికి 15.77% రాబడిని సాధించింది. ఈ ఫండ్ ఖర్చు నిష్పత్తి 1.07% కాగా, ఇది మిగతా రెండు ఫండ్స్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ అని చెప్పవచ్చు. కనీస SIP రూ.500, కనీస లంప్‌సమ్ రూ.1,000. గత 5 సంవత్సరాలలో రూ.3.5 లక్షల ఒకేసారి పెట్టుబడి రూ.11,90,000 కార్పస్‌గా మారింది. ఈ ఫండ్ విశ్వసనీయ బ్రాండ్‌పై నమ్మకం ఉన్నవారికి మంచి ఛాయిస్.


ఈ మూడు ఫండ్స్ గత 5 సంవత్సరాలలో మంచి రాబడిని అందించాయి. వీటి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ పెట్టుబడిదారులను దీర్ఘకాలిక పెట్టుబడులు చేసేలా ప్రోత్సహించాయి.

గమనిక: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 08:47 PM