Share News

Gold Rate Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

ABN , Publish Date - Feb 16 , 2025 | 07:29 AM

Gold Rate Today: బంగారం కోనే వారికి అదిరిపోయే శుభవార్త. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు మారడంతోనే బంగారం ధరలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Gold Rate Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rate Today

గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతునే వచ్చాయి. పసిడి రేటు అమాంతంగా పెరగడంతో మహిళలు బంగారం కొనాలంటేనే భయపడేవారు. 85 వేల మార్క్‌కు పైగా ఉండటంతో బంగారం ప్రియులు అటువైపు దృష్టి సారించలేదు. వరుసగా బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో పసిడి మీద ఇన్వెస్ట్‌మెంట్స్ కాస్త తగ్గాయి. రేట్లు తగ్గినప్పుడు కొద్దామనే భావన చాలా మందిలో కనిపించింది. వారికి ఊరటను కల్పిస్తూ ఎట్టకేలకు బంగారం ధర దిగి వచ్చింది. ఒక్కరోజు గ్యాప్‌లోనే భారీగా తగ్గింది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ డిమాండ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం..


హైదరాబాద్‌లో బంగారం ధరలు..

ఫిబ్రవరి15వ తేదీతో పోలిస్తే 16వ తేదీన బంగారం ధరల్లో మార్పు కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 మేర తగ్గింది. దీంతో తులం ధర రూ. 78 వేల 900 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములపై రూ. 109 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 86,070 వద్దకు దిగివచ్చింది.


స్థిరంగా వెండి ధర..

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేటు స్థిరంగా ఉంది. అంతకు ముందు రోజు కిలో వెండి రూ.1000 మేర పెరగడంతో రూ.1,08,000 వద్దకు చేరింది. ఇవాళ ఆ రేటులో మార్పు లేదు.

హైదరాబాద్: ఇవాళ వెండి ధర గ్రాము రూ. 108, కిలో రూ. 1,08,000 .


ఆర్థిక పరిస్థితులతో మార్పులు..

ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు మారడంతోనే బంగారం ధరలో మార్పులు కనిపించినట్లు తెలుస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడము దీనికి కారణం. ట్రంప్ పరిపాలన, ఇటీవల సుంకాల ఫలితంగా కూడా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిలో మార్పులు కనిపిండము మరో కారణం.

For Business News And Telugu News

Updated Date - Feb 16 , 2025 | 08:14 AM