Share News

Nifty Faces Possible Correction: టెక్‌ వ్యూ మరో కరెక్షన్‌కు ఆస్కారం

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:19 AM

గత వారం నిఫ్టీ 25,000 వద్ద బ్రేకౌట్‌ సాధించి 400 పాయింట్ల లాభంతో 25,300 సమీపంలో క్లోజైంది. గత కొద్ది రోజుల్లో 800 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించి ఇటీవల ఏర్పడిన గరిష్ఠ స్థాయిలకు చేరువవుతోంది...

Nifty Faces Possible Correction: టెక్‌ వ్యూ మరో కరెక్షన్‌కు ఆస్కారం

టెక్‌ వ్యూ: మరో కరెక్షన్‌కు ఆస్కారం

గత వారం నిఫ్టీ 25,000 వద్ద బ్రేకౌట్‌ సాధించి 400 పాయింట్ల లాభంతో 25,300 సమీపంలో క్లోజైంది. గత కొద్ది రోజుల్లో 800 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించి ఇటీవల ఏర్పడిన గరిష్ఠ స్థాయిలకు చేరువవుతోంది. మిడ్‌క్యాప్‌-100 సూచీ 1,200 పాయింట్లు లాభపడి ఇటీవల గరిష్ఠ స్థాయి 59,000కు చేరువైంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. స్మాల్‌క్యాప్‌-100 సూచీ కూడా 255 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ ప్రస్తుతం సెప్టెంబరులో బలమైన కరెక్షన్‌లో ప్రవేశించిన గరిష్ఠ స్థాయి 25,300 వద్ద ఉంది. అప్రమత్తంగా ఉండాలి. గత శుక్రవారం అమెరికన్‌ మార్కెట్లలో ఏర్పడిన బలమైన డౌన్‌ట్రెండ్‌ కారణంగా ఈ వారం నిఫ్టీ నెగెటివ్‌గానే ప్రారంభం కావచ్చు. ఈ క్రమం లో 25,000 వద్ద మరో పరీక్షకు గురి కానుంది.

బుల్లిష్‌ స్థాయిలు: పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌లో పడినా 25,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి లేదా కన్సాలిడేట్‌ కావాలి. ప్రధాన నిరోధం 25,300. ఆ పైన నిలదొక్కుకోగలిగితే తదుపరి టార్గెట్‌ 25,500.

బేరిష్‌ స్థాయిలు: 25,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 24,500.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం 1,000 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించిన ఈ సూచీ 56,600 వద్ద ముగిసి ఇటీవల సాధించిన గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉంది. రియాక్షన్‌లో పడినా సానుకూలత కోసం మద్దతు స్థాయి 56,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 55,400, 55,000. ప్రధాన నిరోధ స్థాయిలు 56,600, 57,300.

పాటర్న్‌: సానుకూలత కోసం నిఫ్టీ 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి. మరోసారి 25,000 వద్ద పరీక్ష ఎదుర్కొంటున్నందున ఇక్కడ బలం ప్రదర్శించినప్పుడే స్వల్పకాలిక సానుకూలత ఏర్పడుతుంది. గత నెలలో 25,300 వద్ద బలమైన టాప్‌ ఏర్పడింది. సానుకూలత కోసం దాన్ని ఛేదించాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,210, 25,300

మద్దతు : 25,100, 25,000

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 05:19 AM