Share News

Nifty Technical Analysis: టెక్‌ వ్యూ కీలక నిరోధం 25000 వద్ద పరీక్ష

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:10 AM

నిఫ్టీ గత వారం రికవరీని కొనసాగించి వారం మొత్తం మీద 373 పాయింట్ల లాభంతో 25,140 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో నిఫ్టీ 700 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించింది. అయినప్పటికీ గత నాలుగు వారాలుగా...

Nifty Technical Analysis: టెక్‌ వ్యూ కీలక నిరోధం 25000 వద్ద పరీక్ష

టెక్‌ వ్యూ కీలక నిరోధం 25000 వద్ద పరీక్ష

నిఫ్టీ గత వారం రికవరీని కొనసాగించి వారం మొత్తం మీద 373 పాయింట్ల లాభంతో 25,140 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో నిఫ్టీ 700 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించింది. అయినప్పటికీ గత నాలుగు వారాలుగా ప్రధాన స్థాయి 25,000 వద్ద సైడ్‌వేస్‌ కదలికలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద మార్కెట్‌ గత వారం నిలకడగా క్లోజయినా ప్రస్తుతం గతంలో ఏర్పడిన మేజర్‌ టాప్‌ 25,200 సమీపంలో ఉంది. గతంలో రివర్సల్‌ ఏర్పడిన ఈ స్థాయిలో వరుసగా నాలుగో వారం పరీక్ష ఎదుర్కొంటోంది. తదుపరి దిశ తీసుకునే ముందు ఈ స్థాయిలో కన్సాలిడేట్‌ కావచ్చు. ప్రస్తుత అప్‌ట్రెండ్‌ కొనసాగించాలంటే ఈ స్థాయిలో నిలదొక్కుకుని తీరాలి. మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు సైతం గత వారం ర్యాలీ సాధించాయి.

బుల్లిష్‌ స్థాయిలు: అమెరికన్‌ మార్కెట్లో శుక్రవారం నాటి బలహీనత కారణంగా ఈ వారంలో నిఫ్టీ అప్రమత్త ట్రెండ్‌లో ట్రేడయ్యే ఆస్కారం ఉంది. అప్‌ట్రెండ్‌ కొనసాగించాలంటే 25,200 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ప్రధాన నిరోధ స్థాయిలు 25600, 26000.

బేరిష్‌ స్థాయిలు: ప్రస్తుత స్థాయిల నుంచి దిగజారినట్టయితే భద్రత కోసం 25,000 వద్ద నిలదొక్కుకుకుని తీరాలి. విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,800. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 24,500.


బ్యాంక్‌ నిఫ్టీ: రెండు నెలల డౌన్‌ట్రెండ్‌ అనంతరం ఈ సూచీ టెక్నికల్‌ రికవరీ సాధించి 54,800 వద్ద ముగిసింది. తదుపరి మానసిక అవధి 55,000. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. బలహీనపడినా ప్రధాన మద్దతు స్థాయి 54,400 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది.

పాటర్న్‌: రెండు వారాల ర్యాలీ ప్రభావంతో నిఫ్టీ స్వల్ప ఓవర్‌బాట్‌ స్థితిలో ప్రవేశిస్తోంది. మరింత కన్సాలిడేషన్‌ ఉండవచ్చుననేందుకు ఇది సంకేతం. వీక్లీ చార్టుల్లో 25,200 వద్ద డబుల్‌ టాప్‌ ఏర్పడింది. సానుకూలత కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాలి. అదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ పైన కూడా నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25120, 25200

మద్దతు : 25000, 24930

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 05:10 AM