CEA Nageswaran: సుంకాల పోటు తాత్కాలికమే
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:02 AM
మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల పోటు ప్రభావం తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అనంత నాగేశ్వరన్ అన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రెండు దేశాల మధ్య త్వరలోనే సుంకాలపై....
వృద్ధి రేటుకు ఢోకా లేదు
సీఈఏ నాగేశ్వరన్
కోల్‌కతా: మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల పోటు ప్రభావం తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అనంత నాగేశ్వరన్ అన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రెండు దేశాల మధ్య త్వరలోనే సుంకాలపై ఒక అవగాహన కుదిరే అవకాశం ఉందన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన ఒక సదస్సులో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్న ఆయన ఈ విషయం చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై అమెరికా-భారత్ దాదాపుగా ఒప్పందానికి చేరువైనా, కొన్ని అనూహ్య పరిణామాలతో ఒప్పందం కుదురలేదన్నారు. సీఈఏ తాజా ప్రకటనతో బీటీఏ కోసం రెండు దేశాల మధ్య తెర వెనుక ఇంకా మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సుంకాల సమస్య నుంచి ఎగుమతిదారులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రభుత్వం చర్చిస్తున్నట్టు నాగేశ్వరన్ చెప్పారు. సుంకాలతో మన జీడీపీ వృద్ధి రేటుకు పెద్దగా వచ్చే ముప్పు కూడా ఏమీ లేదని తేల్చి పారేశారు. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి జోరు మున్ముందు త్రైమాసికాల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి