Apollo Hospitals MD Sunita Reddy: అపోలో హాస్పిటల్స్‌లో 1.3 శాతం వాటా విక్రయించిన సునీతా రెడ్డి
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:30 AM
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.3 శాతంవాటాను రూ.1,489 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో..
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.3% వాటాను రూ.1,489 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో బల్క్ డీల్స్ ద్వారా ఈ అమ్మకం జరిగింది. మొత్తం 18,97,239 షేర్లను ఒక్కోటీ రూ.7,850 చొప్పున విక్రయించడం జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ నిధులతో ప్రమోటర్ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్లు తెలిపింది. ఈ డీల్ అనంతరం అపోలో హాస్పిటల్స్‌లో ప్రమోటర్ గ్రూప్ వాటా 29.3ు నుంచి 28 శాతానికి తగ్గింది. తనఖాలో ఉన్న వాటా 13.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గనుందని సంస్థ పేర్కొంది. బీఎ్‌సఈలో అపోలో హాస్పిటల్స్ షేరు శుక్రవారం 0.17 శాతం పెరిగి రూ.7,938.40 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి