Share News

Emirates NBD-RBL Bank: భారత బ్యాంకింగ్ రంగంలో మరో పెద్ద డీల్!

ABN , Publish Date - Oct 13 , 2025 | 09:33 PM

భారత ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో మరో పెద్ద డీల్ జరుగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌కు చెందిన.. ఎమిరేట్స్ NBD బ్యాంక్, RBL బ్యాంక్‌లో 60 శాతం మెజారిటీ స్టేక్‌ను సొంతం చేసుకోవాలని..

Emirates NBD-RBL Bank:  భారత బ్యాంకింగ్ రంగంలో మరో పెద్ద డీల్!
Emirates NBD-RBL Bank

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో మరో పెద్ద డీల్ జరుగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దుబాయ్ బేస్డ్ ఎమిరేట్స్ NBD బ్యాంక్ ఈ కొత్త డీల్ చేయబోతున్నట్టు సమాచారం. RBL బ్యాంక్‌లో 60 శాతం మెజారిటీ స్టేక్‌ను స్వాధీనం చేసుకోవాలని NBD చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఎమిరేట్స్ NBD, UAEలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటి. అనుకున్నట్టుగానే ఈ డీల్ విజయవంతమైతే, ప్రమోటర్ కేటగిరీ లేకుండా వంద శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్లు కల్గిన RBL బ్యాంక్‌లో విదేశీ ఇన్వెస్టర్ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. భారతదేశంలోని RBL బ్యాంక్‌లో 60% స్టేక్‌ను సుమారు 3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ఎమిరేట్స్ బ్యాంకు సిద్ధమవుతోంది. ఈ ట్రాన్సాక్షన్ పూర్తిగా ఫ్రెష్ ఎక్విటీ ఇస్స్యూయన్స్ ద్వారా జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ప్రక్రియలో, కంపెనీ తన షేర్‌ హోల్డర్లకు లేదా ఇతర ఇన్వెస్టర్లకు కొత్త షేర్లను అందజేస్తుంది. దీనివల్ల ఆ ఇన్వెస్టర్లు కంపెనీలో యాజమాన్య హక్కులను పొందుతారు. సదరు కంపెనీ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న షేర్లను అమ్మడం కాకుండా , బదులుగా కొత్త షేర్లను జారీ చేస్తుంది. ఈ నిధులు సాధారణంగా కంపెనీ వృద్ధికి, విస్తరణకు, లేదా ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగిస్తారు.


RBI మార్గదర్శకాల ప్రకారం, విదేశీ బ్యాంకులు భారతీయ ప్రైవేట్ బ్యాంకుల్లో 49 శాతం వరకు స్టేక్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే మెజారిటీ స్టేక్ కోసం ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి. ఈ డీల్ RBL బ్యాంక్‌కు మరింత క్యాపిటల్ అందించి, ఆ సంస్థ ఇంకా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది.

ఇలాఉంటే, ఎమిరేట్స్ NBD వంటి గ్లోబల్ ప్లేయర్ ప్రవేశంతో, భారత-మధ్యప్రాచ్య బ్యాంకింగ్ టై-అప్‌లు మరింత బలపడతాయని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ భారీ డీల్ భారతీయ బ్యాంకింగ్ రంగంలో FDI పెరుగుదలకు ఊతమిస్తుంది.


ఇవి కూడా చదవండి..

స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా‌ వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..

షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2025 | 10:00 PM