Stock Market: ట్రంప్ నిర్ణయంతో ఐటీ షేర్లు కుదేల్.. సూచీలకు భారీ నష్టాలు..
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:10 PM
హెచ్1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.
హెచ్1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగానే చలించినప్పటికీ ఐటీ స్టాక్స్ వెనక్కి లాగడంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి. (Business News).
గత శుక్రవారం ముగింపు (82, 626)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు (Sensex today). సోమవారం సెన్సెక్స్ 81, 997 - 82, 583 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 466 పాయింట్ల నష్టంతో 82, 159 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 124 పాయింట్ల నష్టంతో 25, 202 వద్ద స్థిరపడింది (market closing update).
సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, హడ్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌బీసీసీ షేర్లు లాభాలను ఆర్జించాయి (Indian markets today). ఎంఫసిస్, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, కోఫోర్జ్ లిమిటెడ్, పెర్సిస్టెంట్, సయింట్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 394 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.31గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి