Share News

Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్..

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:10 PM

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి కారణంగా దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అయితే బ్యాంకింగ్ రంగం మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందని అంచనాలు వెలువడడం సూచీలకు సానుకూలంగా మారింది.

Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్..
Stock Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి కారణంగా దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అయితే బ్యాంకింగ్ రంగం మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందని అంచనాలు వెలువడడం సూచీలకు సానుకూలంగా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి (Business News).


గత శుక్రవారం ముగింపు (81, 306)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది (Sensex gains). ఒక దశలో దాదాపు 500 పాయింట్లు ఎగబాకి 81, 799 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో చివరకు సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 81, 635 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 24, 9673 వద్ద స్థిరపడింది (stock market profits).


సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, జుబిలెంట్ ఫుడ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, జైడుస్ లైఫ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఏంజెల్ వన్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీడీఎస్‌ఎల్, ఫోర్టిస్ హెల్త్, మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 71 పాయింట్లు అర్జించింది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.58గా ఉంది.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..

ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2025 | 04:10 PM