Share News

Stock Market India: మూడు రోజుల లాభాలకు తెర

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:44 AM

ఈక్విటీ మార్కెట్‌ మూడు రోజుల లాభాలకు తెర దించింది. హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో సెబీ ఇచ్చిన క్లీన్‌చిట్‌తో అదానీ గ్రూప్‌ షేర్లలో ర్యాలీ ఏర్పడినా బ్లూచిప్‌ కంపెనీలు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌...

Stock Market India: మూడు రోజుల లాభాలకు తెర

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ మూడు రోజుల లాభాలకు తెర దించింది. హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో సెబీ ఇచ్చిన క్లీన్‌చిట్‌తో అదానీ గ్రూప్‌ షేర్లలో ర్యాలీ ఏర్పడినా బ్లూచిప్‌ కంపెనీలు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకారం మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టింది. సెన్సెక్స్‌ 387.73 పాయింట్ల నష్టంతో 82,626.23 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 528.04 పాయింట్ల వర కు నష్టపోయి 82,485.92 స్థాయిని తాకింది. నిఫ్టీ 96.55 పాయింట్ల నష్టంతో 25,327.05 వద్ద ముగి సింది. అయితే వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 721.53 పాయింట్లు, నిఫ్టీ 213.05 పాయింట్లు లాభపడ్డాయి.

అదానీ షేర్లు జూమ్‌: సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీలన్నింటి ఉమ్మడి మార్కెట్‌ క్యాప్‌ రూ.69,000 కోట్ల మేరకు పెరిగి రూ.13.96 లక్షల కోట్లకు చేరింది. అదానీ పవర్‌ గరిష్ఠంగా 12.40ు లాభపడగా అదానీ టోటల్‌ గ్యాస్‌ (7.35ు), అదానీ గ్రీన్‌ ఎనర్జీ (5.33ు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (5.04ు), అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ (4.70ు), సంఘీ ఇండస్ర్టీస్‌ (1.41ు), ఏసీసీ (1.21ు), అదానీ పోర్ట్స్‌ (1.09ు), అంబుజా సిమెంట్స్‌ (0.28ు) లాభపడ్డాయి.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 03:44 AM