Stock Market: వరుసగా రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:02 PM
భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే తరహాలో పయనించాయి. వరుసగా రెండో రోజూ కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి.
భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే తరహాలో పయనించాయి. వరుసగా రెండో రోజూ కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలకు దిగుతుండడం మదుపర్లను మరింత కలవరపెడుతోంది. మంగళవారం విదేశీ మదుపర్లు 6, 516 కోట్లు విలువైన షేర్లును విక్రయించారు. ఆ ప్రభావం కూడా పడడంతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి (Business News).
మంగళవారం ముగింపు (80, 786)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ రోజుంతా నష్టాల్లోనే కదలాడింది (Sensex gains). మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. గురువారం సెన్సెక్స్ 80, 013- 80, 775 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 705 పాయింట్ల నష్టంతో 80, 080 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 211 పాయింట్ల నష్టంతో 24, 500 వద్ద స్థిరపడింది (stock market crash).
సెన్సెక్స్‌లో కల్యాణ్ జువెల్లర్స్, యూనో మిండా, జిందాల్ స్టెయిన్‌లెస్, టైటాన్ కంపెనీ, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ షేర్లు లాభాలను ఆర్జించాయి. అదానీ టోటల్ గ్యాస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్స్, పూనావాలా ఫిన్‌కార్ప్, సీఈఎస్‌సీ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 718 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.63గా ఉంది.
ఇవీ చదవండి:
2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
బంగారం ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఏంటంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి