Sensex Gains: మూడో రోజూ లాభాల్లో సెన్సెక్స్
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:27 AM
స్టాక్ మార్కెట్‌లో అప్‌ట్రెండ్ బుధవారం నాడు కూడా కొనసాగింది. సెన్సెక్స్ 323.83 పాయింట్ల లాభంతో 81,425.15 వద్ద ముగియగా నిఫ్టీ 104.5 పాయింట్ల లాభంతో 24,973.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాభాలతో...
ముంబై: స్టాక్ మార్కెట్‌లో అప్‌ట్రెండ్ బుధవారం నాడు కూడా కొనసాగింది. సెన్సెక్స్ 323.83 పాయింట్ల లాభంతో 81,425.15 వద్ద ముగియగా నిఫ్టీ 104.5 పాయింట్ల లాభంతో 24,973.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడో రోజు కాగా నిఫ్టీకి ఆరో రోజు. భారత-అమెరికా వాణిజ్య చర్చలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే రావచ్చునన్న ఆశలు, జీఎ్‌సటీ రేట్ల సవరణతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థ భాగంలో కంపెనీల ఆదాయాలు బాగా పుంజుకుంటాయన్నఅంచనాలు, ఎఫ్‌పీఐల కొనుగోళ్లు కూడా ఇందుకు తోడయ్యాయి.
బుధవారం ప్రారంభమైన అర్బన్ కంపెనీ ఐపీఓకు మదుపరులు బ్రహ్మరఽథం పట్టారు. సబ్‌స్ర్కిప్షన్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇష్యూ మొత్తం సబ్‌స్ర్కైబ్ అయింది. తొలి రోజు ముగిసే సరికి 3.13 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయినట్టు సమాచారం.
ఎంఎఫ్ లావాదేవీల్లో ఎన్‌ఎ్‌సఈ రికార్డు: మ్యూచువల్ ఫండ్ లావాదేవీల్లో ‘ఎన్‌ఎ్‌సఈ ఎంఎఫ్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫాం’ రికార్డు సృష్టించింది. బుధవారం ఈ వేదికపై రికార్డు స్థాయిలో 15 లక్షలకుపైగా లావాదేవీలు నమోదైనట్టు ఎన్‌ఎ్‌సఈ తెలిపింది. సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం, మద్దతుతోనే ఇది సాధ్యమైందని ఎన్‌ఎ్‌సఈ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News