అదానీలపై దర్యాప్తులో సాయం చేయండి
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:27 AM
అదానీ గ్రూప్ ప్రధాన ప్రమోటర్లు గౌతం అదానీ, సాగర్ అదానీలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో భారత ప్రభుత్వ అధికారుల సహాయం అభ్యర్ధించామని...
భారత్‌కు ఎస్‌ఈసీ అభ్యర్థన
న్యూయార్క్: అదానీ గ్రూప్ ప్రధాన ప్రమోటర్లు గౌతం అదానీ, సాగర్ అదానీలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో భారత ప్రభుత్వ అధికారుల సహాయం అభ్యర్ధించామని అమెరికన్ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరౌఫి్‌సకు తెలిపింది. భారత్‌లో ఉంటున్న వీరిద్దరికి ఆరోపణల అభియోగ పత్రాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. దీంతో ఈ కేసులో అదానీలపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపి వేస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం అమలవుతుందా, లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలకు 26.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,292 కోట్లు) ముడుపులు ముట్టచెప్పిందని గత ఏడాది బైడెన్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆరోపించి, దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయాన్ని కప్పిపెట్టి 2021లో అదానీ గ్రూప్ అమెరికా మార్కెట్‌లో రుణ పత్రాలు జారీ చేసి నిధులు సేకరించిందని ఆరోపణ.
షేర్లు ఢమాల్ : ఈ వార్తలతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ బేర్ పట్టులోకి పోయాయి. 11 లిస్టెడ్ కంపెనీల్లో తొమ్మిది కంపెనీల షేర్లు బుధవారం నాలుగు శాతం వరకు నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 3.75 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.78 శాతం, అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ 1.36 శాతం చొప్పున, ఏసీసీ 0.93 శాతం, అదానీ విల్‌మార్ 0.9 శాతం నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News