Share News

SEBI Simplifies Transfer: వారసులకు సులభంగా సెక్యూరిటీల బదిలీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:03 AM

నామినీల నుంచి వారసులకు షేర్లు, రుణ పత్రాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి సెక్యూరిటీల బదిలీ ని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ సులభతరం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నామినీలు వీటిని...

SEBI Simplifies Transfer: వారసులకు సులభంగా సెక్యూరిటీల బదిలీ

జనవరి 1 నుంచి అమలు : సెబీ

న్యూఢిల్లీ: నామినీల నుంచి వారసులకు షేర్లు, రుణ పత్రాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి సెక్యూరిటీల బదిలీ ని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ సులభతరం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నామినీలు వీటిని చట్టబద్ద వారసులకు బదిలీ చేస్తే కొన్ని సమయాల్లో వాటిని ‘బదిలీ’గా పరిగణించి, మూలధన లాభాల పన్ను (సీజీటీ) విధిస్తున్నారు. అయితే 1961 నాటి ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 47 (ఐఐఐ) ప్రకారం ఇలాంటి లావాదేవీలపై చెల్లించే పన్నుపై నామినీలు రిఫండ్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దీనికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తెరపడనుంది. ఇందుకోసం టీఎల్‌హెచ్‌ (ట్రాన్స్‌మిషన్‌ టు లీగల్‌ హెయిర్స్‌) పేరుతో కొత్త కోడ్‌ అమలు చేస్తారు. దీనివల్ల నామినీలపైనా ఎటువంటి పన్నుల భారం పడదని సెబీ పేర్కొంది.

ఏఐఎ్‌ఫల ఎన్‌ఏవీలు

ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల (ఏఐఎఫ్‌) నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ)ల ప్రకటనల్లో పారదర్శకత కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శుక్రవారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ సంస్థలు ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి తమ డిపాజిటరీ వ్యవస్థల్లో ఆయా పథకాల ఎన్‌ఏవీలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ సంస్థలే ఈ పథకాల పెట్టుబడుల విలువను లెక్కిస్తే ఏ తేదీన లెక్కించారనే విషయాన్ని తమ రికార్డుల్లో నమోదు చేయాలని సెబీ కోరింది. ఈ సర్క్యులర్‌ను 45 రోజుల్లో ఏఐఎ్‌ఫలు అమలు చేయాలని సెబీ కోరింది.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 04:03 AM