Karvy Scam: కార్వీ ఇన్వెస్టర్ల క్లెయిమ్‌లకు డిసెంబరు వరకు గడువు
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:19 AM
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్) చేతుల్లో మోసపోయిన ఇన్వెస్టర్లు తమ సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ గురువారం...
ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్) చేతుల్లో మోసపోయిన ఇన్వెస్టర్లు తమ సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ గురువారం తెలిపింది. గతంలో ప్రకటించిన గడువు ఈ జూన్ 2 తోనే ముగిసింది. 2020 నవంబరు 23న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్వీని డిఫాల్టర్‌గా ప్రకటించింది. సొమ్ము క్లెయిమ్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లు 1800 266 0050 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయడం లేదా ఛ్ఛీజ్చఠజ్టూజీటఛి ఃుఽట్ఛ.ఛిౌ.జీుఽ కు మెయిల్ చేయడం ద్వారా ఎన్‌ఎ్‌సఈని సంప్రదించవచ్చని పేర్కొంది. ఇన్వెస్టర్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను కేఎ్‌సబీఎల్ చైర్మన్, ఎండీ పార్థసారధిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 7 ఏళ్ల పాటు నిషేధించడంతో పాటు ఆయనపై రూ.21 కోట్ల జరిమానా విధిస్తూ సెబీ 2023 ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి