SBI Women Employees: ఐదేళ్లలో 30 శాతం మహిళా ఉద్యోగులు
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:26 AM
రాబోయే ఐదేళ్లలో మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పెంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బావిస్తోంది. ఇందుకు అనుగుణంగా లింగ వైవిధ్యాన్ని పెంచే వ్యూహాన్ని రూపొందించింది. తమ బ్యాంకులో...
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పెంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బావిస్తోంది. ఇందుకు అనుగుణంగా లింగ వైవిధ్యాన్ని పెంచే వ్యూహాన్ని రూపొందించింది. తమ బ్యాంకులో ఫ్రంట్‌లైన్ సిబ్బందిని చూసినట్టయితే వారిలో మహిళలు 33% ఉన్నారని, మొత్తం సిబ్బందిని చూస్తే మాత్రం 27% మాత్రమే ఉన్నారని, లింగ వైవిధ్యాన్ని మరింత మెరుగుపరచాలనుకుంటున్నామని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్), చీఫ్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. పురుష, మహిళా ఉద్యోగుల శాతం లో ఈ వ్యత్యాసాన్ని తొలగించి మధ్యకాలికంగా 30% మహిళా సిబ్బంది లక్ష్యం చేరాలన్నది తమ ధ్యేయమని ఆయన తెలిపారు. ఎస్‌బీఐలో ప్రస్తుతం 2.4 లక్షల మంది ఉద్యోగులున్నారు. బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా దేశంలోని ఏ ఇతర సంస్థలో అయినా గరిష్ఠ ఉద్యోగుల సంఖ్య ఇదే. మహిళా ఉద్యోగుల సౌకర్యం కోసం తమ బ్యాంక్ క్రెష్ (శిశు రక్షణ కేంద్రం) అలవెన్స్, ఫ్యామిలీ కనెక్ట్ కార్యక్రమం, మాతృత్వ సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరే మహిళలకు శిక్షణ, సిక్ లీవ్ పెంపు వంటి పలు సౌకర్యాలు కల్పిస్తున్నదని ఆయన వెల్లడించారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా వారికి సంపూర్ణ సురక్షిత, సమ్మిళిత వాతావరణం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎస్‌బీఐలో పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న బ్రాంచీల సంఖ్య 340కి పైగా ఉండడమే మహిళల పట్ల తమ చిత్తశుద్ధికి నిదర్శనమని కిశోర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News