Sanhi New Mid Scale Hotel: హైదరాబాద్‌లో సంహీ హోటల్స్ విస్తరణ
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:42 AM
సంహీ హోటల్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తన హోటల్స్‌ను మరింత విస్తరిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా 260 గదులతో మరో మిడ్ స్కేల్ హోటల్‌ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సంహీ హోటల్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తన హోటల్స్‌ను మరింత విస్తరిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా 260 గదులతో మరో మిడ్ స్కేల్ హోటల్‌ను నిర్మించనుంది. ఇందుకోసం రూ.125 కోట్ల నుంచి రూ.143 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కాగా ఈ హోటల్ కోసం పీ ప్రమోద, పీ హారిక, ఆరియన్ ఎస్కార్‌లతో ఒక లీజు ఒప్పందం కుదుర్చుకుంది. ఆరియన్ ఎస్కార్ సంస్థ ఈ హోటల్‌ను నిర్మించి తమకు ఇస్తుందని సంహీ తెలిపింది. సంహీ ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో షెరటాన్, ఫెయిర్‌ఫీల్డ్ బై మారియట్ హోటల్స్‌ను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి