Share News

రిటైల్‌ మదుపరులకు ఎఫ్‌ అండ్‌ ఓ పై తగ్గని మోజు

ABN , Publish Date - May 12 , 2025 | 05:35 AM

రిటైల్‌ మదుపరులకు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)పై మోజు తగ్గడం లేదు. మదుపరులకు నష్ట భయం ఎక్కువగా ఉండే ఈ ట్రేడింగ్‌ను దూరం చేసేందుకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గత ఏడాది...

రిటైల్‌ మదుపరులకు ఎఫ్‌ అండ్‌ ఓ పై తగ్గని మోజు

కొత్త నిబంధనలను తీసుకువచ్చే యోచనలో సెబీ

ముంబై: రిటైల్‌ మదుపరులకు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)పై మోజు తగ్గడం లేదు. మదుపరులకు నష్ట భయం ఎక్కువగా ఉండే ఈ ట్రేడింగ్‌ను దూరం చేసేందుకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గత ఏడాది నవంబరులో తీసుకున్న చర్యలు కూడా పెద్దగా ఫలించడం లేదు. రిటైల్‌ మదుపరుల్లో ఇప్పటికీ ఎక్కువ మంది ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. 2023 డిసెంబరు నుంచి 2024 మార్చి మధ్య కాలంతో పాటు గత ఏడాది డిసెంబరు నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు జరిగిన ఇండెక్స్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ సరళిని పరిశీలించిన తర్వాత సెబీ ఈ నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యక్తిగత మదుపరులను ఎఫ్‌ అండ్‌ ఓకు దూరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సెబీ యోచిస్తోంది.

  • డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ చేసే వ్యక్తిగత మదుపరుల సంఖ్య 2023 డిసెంబరు- 2024 మార్చితో పోలిస్తే గత ఏడాది డిసెంబరు-ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో 12 శాతం తగ్గింది. అయితే 2022 డిసెంబరు- 2023 మార్చి మధ్య కాలంలో ఎఫ్‌ అండ్‌ ఓలో ట్రేడింగ్‌ చేసిన మదుపరులతో పోలిస్తే ఇది 77 శాతం ఎక్కువ.

  • ఇదే సమయంలో ప్రీమియం పరంగా చూస్తే ఇండెక్స్‌ ఆప్షన్లలో వ్యక్తిగత మదుపరుల ట్రేడింగ్‌ పరిమాణం 5 శాతం తగ్గింది. నోషనల్‌ లావాదేవీలూ 16 శాతం తగ్గాయి.

  • రెండేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ప్రీమియం లావాదేవీలు 34 శాతం, నోషనల్‌ లావాదేవీల పరిమాణం 99 శాతం పెరిగాయి.


అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు

ఆదరణ

మార్కెట్‌ ఆటుపోట్ల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలు అందించే అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు గిరాకీ పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఈ పథకాల నిర్వహణ కింద ఉన్న పెట్టుబడుల (ఏయూఎం) విలువ రూ.2.26 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఇదే సమయంలో ఈ పథకాల్లో మదుపు చేసే మదుపరుల ఖాతాల (ఫోలియో) సంఖ్య 3.5 లక్షలు పెరిగి 58 లక్షలకు చేరింది. దేశంలోని ఎంఎ్‌ఫలకు ప్రాతినిధ్యం వహించే యాంఫీ ఈ తాజా వివరాలు విడుదల చేసింది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, రుణ పత్రాల్లో మదుపు చేసే ఎంఎఫ్‌ పథకాలను అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ పథకాలుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 05:39 AM