Share News

Reliance Retail Acquisition: రిలయన్స్‌ గూటికి కెల్వినేటర్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:51 AM

స్వీడన్‌ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రోలక్స్‌ గ్రూప్‌నకు చెందిన కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ ఉత్పత్తుల..

Reliance Retail Acquisition: రిలయన్స్‌ గూటికి కెల్వినేటర్‌
Reliance Retail Acquisition

ముంబై: స్వీడన్‌ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రోలక్స్‌ గ్రూప్‌నకు చెందిన కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ కెల్వినేటర్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ లావాదేవీ విలువ 18 కోట్ల స్వీడిష్‌ క్రౌన్లు. అంటే, మన కరెన్సీలో దాదాపు రూ.160 కోట్లు. ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ విభాగమే రిలయన్స్‌ రిటైల్‌. దేశంలో అతిపెద్ద రిటైల్‌ వ్యాపార సంస్థ కూడా. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ (ఏసీ, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్లు, టీవీలు తదితర ఉత్పత్తులు) మార్కెట్లో రిలయన్స్‌ తన వ్యాపార వృద్ధిని కదం తొక్కించేందుకు ఈ కొనుగోలు ఒప్పందం దోహదపడనుంది. కాగా,ఎలక్ట్రోలక్స్‌‌తో లైసెన్స్‌ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిలయన్స్‌ రిటైల్‌ 2019 నుంచే తన రిలయన్స్‌ డిజటల్‌ స్టోర్లలో కెల్వినేటర్‌ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లను విక్రయిస్తోంది.

‘దొడ్ల’ చేతికి ఓసామ్‌ డెయిరీ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దొడ్ల డెయిరీ.. తూర్పు రాష్ట్రాలలో ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఓసామ్‌ డెయిరీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. రూ.271 కోట్లకు ఓసామ్‌ డెయిరీలో వంద శాతం వాటాను చేజిక్కించుకున్నట్లు వెల్లడించింది. దేశ తూర్పు ప్రాంతంలో సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ కొనుగోలు దోహదపడనుందని దొడ్ల డెయిరీ ఎండీ సునీల్‌ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:51 AM