కేంద్రానికి ఆర్‌బీఐ బంపర్ బొనాంజా
ABN , Publish Date - May 09 , 2025 | 04:55 AM
భారత ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరోసారి బంపర్ బొనాంజా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి ఆర్‌బీఐ రూ.3.5 లక్షల కోట్ల వరకు...
ఈసారి రూ.3.50 లక్షల కోట్ల వరకు డివిడెండ్ అందించే అవకాశం
కోటక్ మహీంద్రా బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరోసారి బంపర్ బొనాంజా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి ఆర్‌బీఐ రూ.3.5 లక్షల కోట్ల వరకు డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ అంచనా వేయగా.. ఈ మొత్తం రూ.3 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చని ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్ భావిస్తోంది. ఈసారి ఆర్‌బీఐ నుంచి రూ.2.56 లక్షల కోట్ల డివిడెండ్ లభించవచ్చన్న ప్రభుత్వ బడ్జెట్ అంచనా కంటే అధికమిది. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి (2023-24) గాను ఆర్‌బీఐ అందరి అంచనాలకు మించి రూ.2.1 లక్షల కోట్ల మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఈసారి నిధుల బదిలీ గతసారితో పోలిస్తే కనీసం 50 శాతం మేర పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఫారెక్స్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా కమీషన్లు, విదేశీ కరెన్సీ ఆస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ ఆదాయం, కరెన్సీ ముద్రణ రుసుము రూపంలో ఆర్‌బీఐకి ఆదాయం సమకూరుతుంది. అందులో నుంచి అవసరమైన కేటాయింపులు జరిపిన అనంతరం మిగిలిన నిధులను ఆర్‌బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో బదిలీ చేస్తుంది. ఈనెలాఖరుకల్లా ఆర్‌బీఐ డివిడెండ్‌ను ప్రకటించనుంది. వృద్ధి మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది పన్ను వసూళ్లు బడ్జెట్ లక్ష్యం కంటే తగ్గడంతో పాటు మార్కెట్ ఒడుదుడుకుల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వె్‌స్టమెంట్) ద్వారా కేంద్రం అనుకున్న మేరకు నిధులు సమీకరించలేకపోవచ్చు.
ఆ ఆదాయ లోటును ఆర్‌బీఐ డివిడెండ్ భర్తీ చేయనుంది. ఈసారి స్థూల పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనా కంటే రూ.లక్ష కోట్లు, డిజిన్వె్‌స్టమెంట్ ఆదాయం రూ.40,000 కోట్ల మేర తగ్గవచ్చని కోటక్ బ్యాంక్ ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటును లక్ష్యం మేరకు (జీడీపీలో 4.4 శాతానికి) కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ బంపర్ చెల్లింపులు తోడ్పడనున్నాయని ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్‌కు చెందిన గౌర సేన్ గుప్తా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News