Share News

Indian Economy: దేశం ముందు కీలక సవాళ్లు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:59 AM

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్‌ టారి్‌ఫల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక సవాళ్లు ఎదుర్కోనుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. పెట్టుబడులు పెంచడం ద్వారా వీటిని...

Indian Economy: దేశం ముందు కీలక సవాళ్లు

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

  • బ్యాంకులు, కంపెనీలు చేతులు కలపాలి

  • పెట్టుబడులు పెంచాలి

ముంబై: అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్‌ టారి్‌ఫల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక సవాళ్లు ఎదుర్కోనుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. పెట్టుబడులు పెంచడం ద్వారా వీటిని ఎదుర్కోవచ్చని అన్నారు. ఇందుకోసం బ్యాంకులు, కంపెనీలు చేతులు కలపాలని కోరారు. అమెరికా సుంకాలతో దెబ్బతినే రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ముంబైలో ఫిక్కీ, ఐబీఏ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ ద్రవ్య విధానం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే వృద్ధికి దోహదం చేసేలా ఉంటుందన్నారు.

చర్యలు తీసుకుంటాం: గత ఆర్థిక సంవత్సరం (2024-25) బ్యాంకుల పరపతి వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంపైనా మల్హోత్రా మాట్లాడారు. దీన్ని సరిదిద్దేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా కంపెనీలు తమ నిధుల కోసం ప్రైవేటు రుణాలు, క్యాపిటల్‌ మార్కెట్లపై మొగ్గు చూపడం ఇందుకు ప్రధాన కారణమని ఇదే సదస్సులో పాల్గొన్న ఎస్‌బీఐ చైర్మన్‌ సీ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కంపెనీల దీర్ఘకాలిక రుణ అవసరాలపై దృష్టి పెట్టడం మంచిదన్నారు.


99-Business.jpg

విలీనాలు, కొనుగోళ్ల ఫండింగ్‌ను అనుమతించాలి

ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి

నీరసించిన పరపతి వృద్ధి రేటు పెంచుకునేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లిస్టెడ్‌ కంపెనీల కొనుగోళ్లు, విలీనాలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకూ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఫండింగ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని త్వరలో ఆర్‌బీఐని కోరబోతున్నాయి. ఫిక్కీ, ఐబీఏ నిర్వహించిన సదస్సులో ఎస్‌బీఐ, ఐబీఏ (ఐబీఏ) చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ విషయం వెల్లడించారు. పూర్తి పారదర్శక పద్దతిలో కొనుగోళ్లు, విలీనాలకు రెగ్యులేటరీ సంస్థలు, వాటాదారులు అనుమతించినప్పుడు, అలాంటి కొనుగోళ్లు, విలీనాలకు నిధులు సమకూర్చడంలో పెద్ద రిస్క్‌ ఉండదన్నారు. ప్రస్తుతం కంపెనీలు తమ నిధుల అవసరాల్లో ఎక్కువ భాగాన్ని ఈక్విటీ, రుణ పత్రాలు, అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకుంటున్న విషయాన్ని శెట్టి గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 01:59 AM