Share News

Nifty Market Outlook: సానుకూల సంకేతాలు వస్తే

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:13 AM

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 25000 పై స్థాయిలో ముగిసింది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలు, కొన్ని రంగాల్లో కొనుగోళ్లు ఇందుకు ఊతంగా మారాయి...

Nifty Market Outlook: సానుకూల సంకేతాలు వస్తే

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 25000 పై స్థాయిలో ముగిసింది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలు, కొన్ని రంగాల్లో కొనుగోళ్లు ఇందుకు ఊతంగా మారాయి. ఈ నెలలో అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీరేట్లు తగ్గించవచ్చునన్న సంకేతాలు మళ్లీ ఇన్వెస్టర్లలో జోష్‌ పెంచుతున్నాయి. అదే జరిగితే సూచీలు మరింత పెరగడం ఖాయం. మార్కెట్‌ బ్రెడ్త్‌ కొంత మెరుగవ్వడం సానుకూల అంశం. ప్రస్తుతం మైనింగ్‌, నాన్‌ ఫెర్రస్‌ మెటల్స్‌, ఆటో మొబైల్స్‌-యాన్సిలరీస్‌, ఎలక్ట్రికల్స్‌ సెక్టార్లు బలంగా ఉన్నాయి.

స్టాక్‌ రికమెండేషన్స్‌

బీఈఎల్‌: జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన అనంతరం ఈ షేర్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. ప్రస్తుతం అన్ని ప్రధాన చలన సగటు స్థాయిలను అధిగమించాయి. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగున్నాయి. గత శుక్రవారం రూ.399 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.425 టార్గెట్‌ ధరతో రూ.380 పై స్థాయిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. డిప్స్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తూ దీర్ఘకాలం హోల్డ్‌ చేయాలి. స్టాప్‌లాస్‌ : రూ.360.

లుపిన్‌: ఈ షేర్లు ఏడాది కాలంగా ఎలాంటి రాబడి ఇవ్వలేదు. సైడ్‌వేస్‌ కదలికలతో మంచి బేస్‌ ఏర్పడింది. స్వల్ప, మధ్యకాలిక మూమెంటమ్‌ పెరుగుతోంది. డెలివరీ వాల్యూమ్‌ రావడాన్ని బట్టి బుల్లిష్‌ ట్రెండ్‌ ఆరంభమైందని చెప్పొచ్చు. గత శుక్రవారం రూ.2,043 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ. 2,250 టార్గెట్‌ ధరతో రూ. 2,000 శ్రేణిలో కొనుగోలు చేయాలి. స్టాప్‌లాస్‌ : రూ.1,960.

ఐసీఐసీఐ బ్యాంకు: కొన్ని నెలలుగా ఈ షేర్లు సైడ్‌వేస్‌లో కదులుతున్నాయి. అయితే రూ.1,400 శ్రేణిలోనే కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ. 1,417 వద్ద ముగిసింది. రూ. 1520/1550 టార్గెట్‌ ధరతో రూ. 1,400 శ్రేణిలో అక్యూములేట్‌ చేసుకుని దీర్ఘకాలం ఉంచుకోవాలి. స్టాప్‌లాస్‌ : రూ.1380.


కొచ్చిన్‌ షిప్‌యార్డు: డౌన్‌ట్రెండ్‌లో భాగంగా ఈ ఏడా ది ఏప్రిల్‌ తర్వాత ఏర్పడిన భారీ స్వింగ్‌ అనంతరం ఈ షేర్లు మళ్లీ దిద్దుబాటుకు లోనయ్యాయి. ప్రస్తుతం నౌకా నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టడంతో టర్న్‌ అరౌండ్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.1,745 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1,850 టార్గెట్‌ ధరతో రూ. 1700/1730 శ్రేణిలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.1680.

గ్లాండ్‌ ఫార్మా: ఈ షేర్లు ఇంట్రెస్టింగ్‌ జోన్‌లో ఉన్నా యి. మరోసారి నమోదైన గరిష్ఠానికి చేరువయ్యాయి. ఈ నిరోధాన్ని దాటితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పైగా రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ బాగున్నాయి. గత శుక్రవారం రూ.2,021 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ. 2,160 టార్గెట్‌ ధరతో రూ. 2,000 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ. 1,970.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 05:13 AM