Jeevan Pramaan: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఇక చాలా ఈజీ.. ఇలా చేసేయండి
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:16 PM
పెన్షనర్లు తమ పెన్షన్ కోసం ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . ఇప్పుడు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి నుంచే సులభంగా సబ్మిట్ చేయవచ్చు. బ్యాంక్ లేదా పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 25: పెన్షనర్లకు పెన్షన్ నిరంతరంగా రావాలంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్ పత్రం) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి నుంచే సులభంగా సబ్మిట్ చేయవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్/ఐరిస్) ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతుంది. బ్యాంక్ లేదా పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో (జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా):
అధికారిక వెబ్‌సైట్ jeevanpramaan.gov.inకు వెళ్లండి.
ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, PPO నంబర్, పెన్షన్ రకం, బ్యాంక్ వివరాలు ఎంటర్ చేయండి.
రీ-ఎంప్లాయ్‌మెంట్ లేదా రీ-మ్యారేజ్ వివరాలు కన్ఫర్మ్ చేయండి.
రిజిస్టర్డ్ బయోమెట్రిక్ డివైస్‌తో ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ చేయండి.
సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది, SMS ద్వారా ID వస్తుంది.
UMANG యాప్ ద్వారా:
గూగుల్ ప్లే స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
'జీవన్ ప్రమాణ్' సెర్చ్ చేసి, 'జనరేట్ లైఫ్ సర్టిఫికెట్' సెలెక్ట్ చేయండి.
ఆధార్, PPO వివరాలు ఎంటర్ చేసి, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పూర్తి చేయండి.
DLC జనరేట్ అయి సంబంధిత అథారిటీకి పంపబడుతుంది.
ఆఫ్‌లైన్‌లో:
బ్యాంక్ బ్రాంచ్ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి సబ్మిట్ చేయించుకోవచ్చు.
ఇంటి నుంచి కదలలేని వారికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) డోర్‌స్టెప్ సర్వీస్ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి