Share News

SBI loan hike 2025: ఎస్‌బీఐ గృహ రుణ రేటు 0.25 శాతం పెంపు

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:53 AM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త రుణగ్రహీతలకు గృహ రుణాల (టర్మ్‌ లోన్‌) వడ్డీ రేటు శ్రేణిని 0.25 శాతం పెంచింది. ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. జూలైలో...

SBI loan hike 2025: ఎస్‌బీఐ గృహ రుణ రేటు 0.25 శాతం పెంపు

తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన కొత్త రుణగ్రహీతలపై ప్రభావం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త రుణగ్రహీతలకు గృహ రుణాల (టర్మ్‌ లోన్‌) వడ్డీ రేటు శ్రేణిని 0.25 శాతం పెంచింది. ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. జూలైలో ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీ రేట్ల శ్రేణి 7.5-8.45 శాతంగా ఉంది. తాజా పెంపుతో 7.5-8.70 శాతానికి చేరుకుంది. వడ్డీ శ్రేణిలో దిగువ స్థాయిని యథాతథంగా కొనసాగించిన బ్యాంకు.. ఎగువ స్థాయిని మాత్రం పెంచిన నేపథ్యంలో తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన రుణగ్రహీతలపై అధిక భారం పడనుంది. ఎందుకంటే, బ్యాంకులు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ ఆధారంగా రుణంపై వడ్డీని నిర్ణయిస్తాయి. సాఽధారణంగా మంచి స్కోర్‌ కలిగిన వారికి తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. క్రెడిట్‌ స్కోర్‌ అంతంత మాత్రంగా ఉన్న వారి నుంచి బ్యాంకులు గరిష్ఠ పరిమితి వడ్డీని వసూలు చేస్తుంటాయి. లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయాన్ని మిగతా బ్యాంకులు అనుసరించే అవకాశం ఉంది.

ఎస్‌ఐబీ గృహ రుణ సంబంధిత వడ్డీ రేట్ల వివరాలు..

గృహ రుణం (టర్మ్‌ లోన్‌) 7.50-8.70%

హోమ్‌లోన్‌ మ్యాక్స్‌గెయిన్‌ (ఓడీ) 7.75-8.95%

టాప్‌ అప్‌ లోన్‌ 8.0-10.75%

టాప్‌ అప్‌ (ఓడీ) లోన్‌ 8.25-9.45%

స్థిరాస్తి తనఖాపై రుణం 9.20-10.75%

రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ 10.55%

యోనో ఇన్‌స్టా హోమ్‌ టాప్‌ అప్‌ లోన్‌ 8.35%

Also Read:

30 ఏళ్లుగా ఏపీలో ఉగ్రవాదులు..

సిద్ధార్థ్ రెడ్డిపై అఖిల ప్రియ సెటైర్లు..

వైఎస్ భారతిపై మాజీ మంత్రి సుజాత కీలక వ్యాఖ్యలు..

For More Business News and Telugu News..

Updated Date - Aug 17 , 2025 | 02:53 AM