ChatGPT Go Features: చాట్ జీపీటీ గో ప్లాన్
ABN , Publish Date - Aug 21 , 2025 | 02:57 AM
ఓపెన్ ఏఐ సంస్థ భారత వినియోగదారుల కోసం నెలకు రూ.399 ధరతో ‘చాట్ జీపీటీ గో సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. అత్యాధునిక ఏఐ టూల్స్‌ను దేశవ్యాప్తంగా మరింత మందికి సరసమైన ధరల్లో అందుబాటులోకి తేవాలన్న...
నెలకు రూ.399
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ సంస్థ భారత వినియోగదారుల కోసం నెలకు రూ.399 ధరతో ‘చాట్ జీపీటీ గో సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. అత్యాధునిక ఏఐ టూల్స్‌ను దేశవ్యాప్తంగా మరింత మందికి సరసమైన ధరల్లో అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ కొత్త సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ ప్రారంభించినట్టు తెలిపింది. జీపీటీ-5తో ఈ చాట్ జీపిటీ గో పథకం నడుస్తుంది. ఉచిత చాట్ జీపీటీతో పోలిస్తే ఈ కొత్త సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ ద్వారా సబ్‌స్ర్కైబర్లు భారతీయ భాషల్లో పదింతల సందేశాలు, ఇమేజిలు సృష్టించవచ్చు. ఫైల్స్, ఇమేజిల అప్‌లోడ్ కోసం పదింతలు పెంచుకోవచ్చ ని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ పథకాలు అన్నిటికి యూపీ ఐ చెల్లింపులు సైతం అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
For National News And Telugu News