ONGC Earnings ONGC Market Cap: ఓఎన్‌జీసీ లాభాల్లో ఎంతో మిన్న మార్కెట్ క్యాప్‌లో మాత్రం చిన్న
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:30 AM
ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) షేర్లపై మదుపరులు అంతగా మక్కువ చూపించటం లేదు. గత మూడేళ్లలో ఈ పీఎ్‌సయూ దిగ్గజం రూ.1.16 లక్షల కోట్ల లాభాలు...
అగ్రస్థానం నుంచి 25వ స్థానానికి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) షేర్లపై మదుపరులు అంతగా మక్కువ చూపించటం లేదు. గత మూడేళ్లలో ఈ పీఎ్‌సయూ దిగ్గజం రూ.1.16 లక్షల కోట్ల లాభాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి చూసినా ఓఎన్‌జీసీ అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.38,329 కోట్లు, ఏకీకృతం (స్టాండ్‌ఎలోన్)గా చూస్తే రూ.35,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.697 కోట్లు మాత్రమే. అయినా గత వారాంతానికి స్టాక్ మార్కెట్లో జొమాటో మార్కెట్ క్యాప్ రూ.3.37 లక్షల కోట్లుగా ఉంటే ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాప్ రూ.3.10 లక్షల కోట్లు మాత్రమే.
గతమెంతో ఘనం
పదమూడేళ్లు వెనక్కి వెళితే దేశీయ స్టాక్ మార్కెట్లో రూ.2.44 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఓఎన్‌జీసీ అగ్రస్థానంలో ఉండేది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు రూ.18.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఆర్‌ఐఎల్ అగ్రస్థానంలో, రూ.10.95 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఓఎన్‌జీసీ మాత్రం రూ.3.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో 25వ స్థానానికి పడిపోయింది.
అండర్
వాల్యుయేషన్
మార్కెట్ వర్గాలు ఓఎన్‌జీసీ షేర్ల ప్రస్తుత విలువ దాని అసలు విలువను ప్రతిబింబించడం లేదంటున్నాయి. ఓఎన్‌జీసీకి ఎంఆర్‌పీఎల్ ఈక్విటీలో 71.63 శాతం, హెచ్‌పీసీఎల్ ఈక్విటీలో 54.9 శాతం, ఐఓసీ ఈక్విటీలో 14.20 శాతం, గెయిల్ ఇండియా ఈక్విటీలో 5 శాతం వాటా ఉంది. ఇవిగాక విదేశాల్లో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిలో ఉన్న ఓఎన్‌జీసీ విదేశ్ పూర్తిగా ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ. ఈ సంస్థల్లో ఉన్న ఓఎన్‌జీసీ వాటాల విలువే ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.1.07 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఓఎన్‌జీసీ షేర్ల మార్కెట్ క్యాప్ మరో 33.3 శాతం పెరుగుతుంది. పీఎ్‌సయూ కావడంతోనే ఇన్వెస్టర్లు ఓఎన్‌జీసీ షేర్లను సరిగా అంచనా వేయలేక పోతున్నారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News