Odh Lifesciences: న్యూమోనియా కోసం దేశీయ ఔషధం
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:51 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓధ్ లైఫ్‌సైన్సెస్ పిల్లల్లో వచ్చే న్యూమోనియా వ్యాధి చికిత్స కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేక ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎవోనెమ్-04 పేరుతో...
ఓధ్ లైఫ్‌సైన్సెస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓధ్ లైఫ్‌సైన్సెస్ పిల్లల్లో వచ్చే న్యూమోనియా వ్యాధి చికిత్స కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేక ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎవోనెమ్-04 పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధానికి కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన టెక్నాలజీ డెవల్‌పమెంట్ బోర్డు (టీడీబీ) రూ.19.5 కోట్లు మంజూరు చేసింది. ప్రీ క్లినికల్ పరీక్షలు పూర్తయిన ఈ ఔషధాన్ని త్వరలోనే మనుషులపై పరీక్షిస్తామని కంపెనీ తెలిపింది. ఎవోనెమ్-04 అనే ఈ యాంటీబయోటిక్ నెబ్యులైజేషన్ సస్పెన్షన్ ఔషధం పిల్లల్లో వచ్చే న్యూమోనియాను తగ్గించడంలో సమర్ధవంతంగా పనిచేయడంతో పాటు యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌గానూ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. మన దేశంతో పాటు అనేక దేశాల్లో పిల్లలను కబళిస్తున్న అనారోగ్య సమస్యల్లో న్యూమోనియా ఒకటి. అందుబాటు ధరలో లభించే తమ ఎవోనెమ్-04 ఔషధం ఈ సమస్యను అధిగమించడంలో సమర్ధవంతంగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News