Budget 2025 : నిర్మల నోట గురజాడ గీతం
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:26 AM
తెలుగు కవి గురజాడ అప్పారావు గీతం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వినిపించింది. ఆయన రచించిన దేశభక్తి గీతంలోంచి ఒక చరణం నిర్మల చదివి వినిపించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. ‘దేశమంటే మట్టి కాదోయ్...దేశమంటే మనుషులోయ్..’
తెలుగు కవి గురజాడ అప్పారావు గీతం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వినిపించింది. ఆయన రచించిన దేశభక్తి గీతంలోంచి ఒక చరణం నిర్మల చదివి వినిపించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. ‘దేశమంటే మట్టి కాదోయ్...దేశమంటే మనుషులోయ్..’ అన్న గురజాడ స్ఫూర్తితో ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో తమిళ కవుల కృతులు సాధారణంగా దొర్లుతుంటాయి. అలాంటిది ఇప్పుడు గురజాడ ప్రస్తావన రావడంతో... ఎవరీయన అంటూ పార్లమెంటులో ఆసక్తి రేగింది. గురజాడ స్వాతంత్య్ర పూర్వ కాలానికి చెందిన ప్రముఖ నాటక రచయిత, కవి, సంఘ సంస్కర్త. ఆధునిక భావాలు కలిగిన ఆయనను తెలుగు సాహిత్య వైతాళికునిగా అందరూ గౌరవిస్తారు. ఉమ్మడి విజయనగరంలో సెప్టెంబరు 21, 1862లో జన్మించారు. ఆయనకు పేరు తెచ్చిపెట్టిన నాటకం కన్యాశుల్కం. అప్పారావు నవంబరు 30, 1915లో, 53వ యేట మరణించారు. దేశమంటే......అనే గీతం గురజాడ కవితలు అనే పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం 1910లో వెలువడింది.
Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే
Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి