Share News

25000 పైన నిఫ్టీ ఐదో రోజూ మార్కెట్‌ ముందుకే

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:03 AM

స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడంతో పాటు దేశీ య సంస్థల పెట్టుబడులు అందించిన ఊతంతో ఈక్విటీ మార్కెట్‌ ఐదో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. బుధవారం సెన్సెక్స్‌...

25000 పైన నిఫ్టీ ఐదో రోజూ మార్కెట్‌ ముందుకే

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడంతో పాటు దేశీ య సంస్థల పెట్టుబడులు అందించిన ఊతంతో ఈక్విటీ మార్కెట్‌ ఐదో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. బుధవారం సెన్సెక్స్‌ 213.45 పాయింట్ల లా భంతో 81,857.84 వద్ద ముగియగా నిఫ్టీ 69.90 పాయింట్ల లాభంతో 25,050.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో 15 లాభాలతో ముగియగా ఇన్ఫోసిస్‌ 3.88ు, టీసీఎస్‌ 2.69ు లా భంతో ముందు వరుసలో నిలిచాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మంగళవారం రూ.634.26 కోట్ల విలువ గల అమ్మకాలు జరిపారు.

రీగల్‌ రీసోర్సెస్‌ లిస్టింగ్‌ జోరు: బుధవారం లిస్టింగ్‌ అయిన రీగల్‌ రీసోర్సెస్‌ షేరు 29ు లాభంతో ముగిసింది. బీఎ్‌సఈలో రూ.102 వద్ద లిస్టింగ్‌ అయిన ఈ షేరు మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.131.65 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో కూడా ఈ షేరు అంతే లాభంతో రూ.131.58 వద్ద ముగిసింది. ఈ ధరలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,352.35 కోట్లుగా నిలిచింది.

ఐదు ఐపీఓలకు గ్రీన్‌సిగ్నల్‌: ప్రాథమిక పబ్లిక్‌ ఇష్యూ లు (ఐపీఓ) జారీ చేయడానికి ఐదు కంపెనీలకు సెబీ అనుమతి ఇచ్చింది. వాటిలో సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ఇన్నోవాటివ్యూ ఇండి యా, ఆస్పత్రుల నిర్వహణలోని పార్క్‌ మెడి వరల్డ్‌తో పాటు రుణాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జింకుషాల్‌ ఇండస్ర్టీస్‌, అడ్వాన్స్‌ ఆగ్రోలైఫ్‌ ఉన్నాయి.


నజారా టెక్నాలజీస్‌ షేరు 13% డౌన్‌: ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిషేధం బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో రియల్‌ మనీ గేమింగ్‌ విభాగంలోని నజారా టెక్నాలజీస్‌ షేరు 13ు నష్టపోయింది. బీఎ్‌సఈలో ఈ షేరు 12.82ు నష్టంతో రూ.1,221.65 వద్ద ముగిసింది. అలాగే గేమింగ్‌ విభాగంలోని డెల్టా కార్పొరేషన్‌ షేరు 6.47ు నష్టంతో రూ,87.24 వద్ద, ఆన్‌ మొబైల్‌ గ్లోబల్‌ షేరు 3.53ు నష్టంతో రూ.53.27 వద్ద ముగిశాయి.

మౌలికం డీలా

మౌలిక వసతుల రంగానికి చెందిన ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధిరేటు జూలై నెలలో 2 శాతానికి పరిమితమయింది. బొగ్గు, క్రూడాయిల్‌, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తుల విభాగాల్లో ఉత్పత్తి క్షీణత ఇందుకు కారణం. ఈ రంగాల వృద్ధి గత ఏడాది జూన్‌లో 6.3ు ఉండగా గత నెలలో 2.2 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై నెలల మధ్య కాలంలో సైతం ఈ రంగాల వృద్ధిరేటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 6.3ు నుంచి 1.6 శాతానికి క్షీణించింది.

వచ్చే సెప్టెంబరుకి

నిఫ్టీ 28,000

జీఎ్‌సటీ సంస్కరణల ప్రభావంతో వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి నిఫ్టీ 28,000 స్థాయిని చేరుతుందని బ్రోకరేజి కంపెనీ ఎంకే రీసెర్చ్‌ అనాలిసిస్‌ అంచనా వేస్తోంది. జీఎ్‌సటీ సుంకాల సవరణ ఆర్థిక వృద్ధికి, మార్కెట్‌కు ఉత్తేజం అవుతుందని పేర్కొంది. రాబోయే కాలంలో ధర-రాబడి నిష్పత్తి 20.7 రెట్లు ఉండవచ్చునన్న అంచనాతో నిఫ్టీ టార్గెట్‌ను నిర్ణయించింది. కన్స్యూమర్‌ విచక్షణా రంగానికి ఓవర్‌ వెయిట్‌ ప్రకటించడంతో పాటు మౌలిక ఆహార ఉత్పత్తులు, సిమెంట్‌ రంగాల్లోని స్మాల్‌-క్యాప్‌, మిడ్‌-క్యాప్‌ కంపెనీలకు పరిస్థితి అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 03:03 AM