NCC Limited: సీసీఎల్ నుంచి ఎన్‌సీసీకి రూ 6829 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:48 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్.. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) నుంచి రూ.6,828.94 కోట్ల ఆర్డర్‌ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్.. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) నుంచి రూ.6,828.94 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు ప్రకటించింది. ఆర్డర్‌లో భాగంగా జార్ఖండ్‌లోని చంద్రగుప్త ప్రాంతంలో సీసీఎల్‌కు చెందిన ఆమ్రపాలి ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్ట్‌లో బొగ్గు వెలికితీత, తరలింపు సహా వ్యాగన్ లోడింగ్ వంటి పనులను చేపట్టాల్సి ఉంటుందని ఎన్‌సీసీ తెలిపింది. ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి ఏడు సంవత్సరాలని పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్‌ఈఎంఎం)ను వినియోగించాల్సి ఉంటుందని ఎన్‌సీసీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి